ETV Bharat / bharat

ఇద్దరు బాలికలపై 8 మంది అత్యాచారం - ఇద్దరు బాలికలపై అత్యాచారం

త్రిపురలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై 8మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

gangrape
అత్యాచారం
author img

By

Published : Mar 31, 2021, 11:27 AM IST

త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో సోమవారం సాయంత్రం బైక్​ మీద బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక మరో ఆరుగురు.. ద్విచక్రవాహనాలపై వచ్చి వారిని కలిశారు. అంతా కలిసి ఆ బాలికలను దట్టమైన అడవి ప్రాంతానికి సుమారు ఏడున్నర గంటల సమయంలో తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికలపై సాముహికంగా అత్యాచారం చేశారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా... భయపడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

Tripura gangrape
ఇద్దరు బాలికలపై.. 8మంది అత్యాచారం

అయితే ఆ బాలికలు ఎలాగోలా తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దాంతో బాధితురాళ్ల తల్లిదండ్రులు.. పోలీసులతో కలిసి ఘటనా ప్రదేశానికి వెళ్లారు. దారుణమైన స్థితిలో ఉన్న బాలికలను ఆసుపత్రిలో చేర్పించారు. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వేరే ఆసుపత్రికి సిఫార్సు చేశారు వైద్యులు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్​ రేప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.