దేశంలో కరోనా కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 44,281 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 512 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. మరణాల సంఖ్య 1,27,571గా ఉంది.
మరోవైపు రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం 50,326 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 80 లక్షలు దాటింది. 106 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల మార్క్ దిగువకు పడిపోయిందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
- రికవరీ రేటు: 92.69%
- మరణాల రేటు: 1.48%
- యాక్టివ్ కేసులు: 4,94,657(5.83%)
మంగళవారం ఒక్కరోజే 11,53,294 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,07,69,151కి చేరినట్లు స్పష్టం చేసింది.