ETV Bharat / bharat

జీతాలు చెల్లించలేదని కార్మికుల విధ్వంసం

కర్ణాటకలోని ఓ ఐఫోన్ తయారీ పరిశ్రమలో తీవ్ర అలజడి చెలరేగింది. వేతనాలు చెల్లించటం లేదన్న కారణంతో.. కార్మికులు ఆందోళనకు దీగారు. పరిశ్రమలోని వాహనాలను, ఫర్నీచర్​, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఓ గదికి నిప్పు కూడా పెట్టారు.

Wistron Company's interiors reportedly damaged by workers
ఐఫోన్​ తయారీ పరిశ్రమలో కార్మికుల ఆందోళన
author img

By

Published : Dec 12, 2020, 3:58 PM IST

Updated : Dec 12, 2020, 6:01 PM IST

కర్ణాటకలోని విస్ట్రాన్​ కార్పొరేషన్​ ఐఫోన్​ తయారీ పరిశ్రమలో కార్మికులు ఆగ్రహానికి లోనయ్యారు. వేతనాలు చెల్లించటం లేదంటూ విధ్వంసానికి దిగారు.

జీతాలు చెల్లించలేదని కార్మికుల విధ్వంసం
Wistron Company's interiors reportedly damaged by workers
కార్మికులు దాడిలో ధ్వంసమైన పరిశ్రమ అద్దాలు

వాహనాలను దగ్ధం చేస్తున్న కార్మికులు

కోలార్​ జిల్లాలోని నరసపుర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో.. వాహనాలు, ఫర్నీచర్, కంప్యూటర్లు, వాహనాలను ధ్వంసం చేశారు. పరిశ్రమలోని ఓ గదికి నిప్పు కూడా పెట్టారు. కార్మికులు రాళ్లు రువ్వడంతో కర్మాగారానికి చెందిన కార్యాలయ అద్దాలు దెబ్బతిన్నాయి.

దగ్ధమైన వాహనం

భారీగా మోహరించిన పోలీసులు

పరిశ్రమవర్గాల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. లాఠీఛార్జ్‌ చేసి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విధ్వంసానికి దిగిన కార్మికులపై కేసు నమోదు చేశారు. విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ ఆపిల్‌ కంపెనీ కోసం ఐఫోన్‌లు తయారు చేయడం సహా లెనెవో, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలకు ఐటీ ఉత్పత్తులను రూపొందిస్తోంది.

ఇదీ చూడండి:పండ్లు అమ్ముకునే మహిళపై యాసిడ్​ దాడి

Last Updated : Dec 12, 2020, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.