గత జమ్ము కశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్ధరించే వరకు తాను చనిపోనని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఫరూక్ భావోద్వేగ ప్రసంగం చేశారు. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ విషయంలో ప్రజలను భాజపా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని.. తప్పుడు వాగ్దానాలు చేస్తుందని ఆరోపించారు ఫరూక్.
"నా ప్రజల(జమ్ము కశ్మీర్) హక్కులు పునరుద్ధరించేంత వరుకు నేను చనిపోను. ప్రజల కోసం ఏదైనా చేయడానికే ఇక్కడ ఉన్నాను. నా పనిని పూర్తి చేసిన రోజే ఈ లోకాన్ని విడుస్తాను."
- ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీ పార్టీ అధ్యక్షుడు
శనివారం పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పీఏజీడీ) నేతలు భేటీ కానున్న నేఫథ్యంలో ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత జమ్ములో అబ్దుల్లా ఏర్పాటు చేసిన తొలి రాజకీయ సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఇదీ చూడండి: 'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు