"తమిళనాడును మార్చాల్సిన సమయం వచ్చింది. నేను గెలిస్తే.. అది ప్రజా విజయం. మార్పు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు. ఏదైనా ప్రజలపైనే ఆధారపడి ఉంది. నా ప్రణాళిక కరోనా వల్ల జాప్యం అయింది. మార్పు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాలను, పరిపాలనను మారుస్తాను. ప్రజల కోసం ఎంత కష్టమైనా భరిస్తా."
- రజనీ కాంత్, దిగ్గజ నటుడు
రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుస్తాం: రజనీ
13:34 December 03
13:28 December 03
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీకాంత్ పిలుపు
- ప్రజాదరణతో రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామని రజనీకాంత్ ప్రకటన
- కులమతాలకు అతీతంగా నీతివంతమైన ఆధ్యాత్మిక రాజకీయాలు అందిస్తాం: రజనీ
- మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం: రజనీకాంత్
- మార్పు.. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ రాదు: రజనీకాంత్
13:18 December 03
మారుస్తాం.. అన్నింటిని మారుస్తాం..
రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజలకు చేయలనుంటున్న సేవ గురించి రజనీ ట్విట్టర్లో పలు విషయాలు వెల్లడించారు. కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలుకుతామని ఉద్ఘాటించారు.
'రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి.. రాష్ట్రంలో నిజాయితి, న్యాయపరమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. జనవరిలో పార్టీ ఏర్పాటు చేస్తాం. ఆ వివరాలు డిసెంబరు 31న ప్రకటిస్తాం. మారుస్తాం, అన్నింటిని మారుస్తాం, ఇప్పుడు కాకపోతే మారెప్పటికీ జరగదు' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు రజనీ.
12:29 December 03
31న రజినీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన
రాజకీయ రంగ ప్రవేశంపై ఏళ్ల తరగబడి సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈనెల 31న పార్టీ పేరు ఇతర వివరాలు ప్రకటించనున్నట్లు తలైవా స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు.
అభిమానులతో భేటీ..
రాజకీయల్లోకి ప్రవేశించే విషయంపై ఇటీవలే రజని అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం తీసుకుంటానని చెప్పిన తలైవా.. తాజాగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎట్టకేలకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు తలైవా ప్రకటించిన నేపథ్యంలో.. తమిళనాడువ్యాప్తంగా ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.