ETV Bharat / bharat

బంగాల్​ దంగల్: 'సంయుక్త' మునిగేనా? తేలేనా?

దాదాపు 35 సంవత్సరాల పాటు బంగాల్‌ను పాలించిన కమ్యూనిస్టు పార్టీలు, ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఉనికి చాటుకునే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖి స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)తో జతకట్టి 'సంయుక్త మోర్చా' పేరుతో మూకుమ్మడిగా బరిలోకి దిగాయి. మరి సంయుక్త మునుగుతుందా? తేలుతుందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

author img

By

Published : Mar 29, 2021, 8:22 AM IST

CONG-LEFT-ISF front
బంగాల్​ దంగల్: సంయుక్త మునిగేనా, తేలేనా?

పశ్చిమ్ బంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉందని తేలినా.. కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖి స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)తో జతకట్టి 'సంయుక్త మోర్చా' పేరుతో మూకుమ్మడిగా బరిలోకి దిగాయి. నేరుగా పదవిలోకి రాలేకున్నా.. ఈసారి ఎన్నికల్లో తాము కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశాలున్నాయని ఈ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. తృణమూల్‌, భాజపాలకు మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే.. తాము నిర్ణయాత్మకంగా మారుతామని లెక్కలు వేసుకుంటున్నారు.

విమర్శలను ఎదుర్కొని...

దాదాపు 35 సంవత్సరాల పాటు బంగాల్‌ను పాలించిన కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో ఇప్పుడు నామమాత్రంగానే మిగిలాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఉనికి చాటుకునే స్థితికి చేరుకుంది. ఈ పార్టీలన్నీ మైనార్టీ ఓట్లను నమ్ముకొని ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఇందుకోసం మత ఛాందస పార్టీగా విమర్శలెదుర్కొంటున్న ఐఎస్‌ఎఫ్‌తో కూటమి కట్టాయి. వామపక్షాలు 171 సీట్లలో, కాంగ్రెస్‌ 91, ఐఎస్‌ఎఫ్‌ 26 సీట్లలో పోటీ చేస్తున్నాయి. అయితే సిద్ధిఖీ పార్టీతో వామపక్షాలు, కాంగ్రెస్‌ జతకట్టడాన్ని భాజపా, తృణమూల్‌ విమర్శిస్తున్నాయి.

ఎవరికి కోత?

samyuktha morcha
సంయుక్త నిలిచేనా?

ముస్లింల ఓట్లు ఒకవేళ సంయుక్త మోర్చాకు పడితే వాటి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే- గతంలో వామపక్షాలకు, కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ముస్లింలు కొన్నాళ్ళుగా తృణమూల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ ఓట్లలో చీలిక వచ్చి కొన్ని సంయుక్త మోర్చాకు పడితే.. అది తమకే లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

"ముస్లిం ఓట్లు చీలితే తృణమూల్‌కు నష్టం. అదే సమయంలో మతఛాందస ముస్లిం పార్టీతో జతకట్టిన నేపథ్యంలో హిందూ ఓట్లు మాకు గంపగుత్తగా పడే అవకాశాలున్నాయి" అని భాజపా నేత ఒకరు వ్యాఖ్యానించారు.

"భాజపా, తృణమూల్‌లు ఈ ఎన్నికలను ద్విముఖ పోరుగా చేయాలనుకున్నాయి. కానీ మేం తృతీయ కూటమిగా బరిలోకి దిగటంతో పరిస్థితి మారింది. ఇప్పుడు రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతోంది" అని వామపక్ష నేత మహమ్మద్‌ సలీం వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ భట్టాచార్య ఓ అడుగు ముందుకేసి.. "ఈ ఎన్నికల్లో మా కూటమి అనూహ్య విజయం సాధించొచ్చు. ఎన్నికల తర్వాత ఎవరికీ మెజార్టీ రాని పక్షంలో మేము కింగ్‌మేకర్లం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి" అని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు 70కిపైగా సీట్లు గెలిచాయి. అవన్నీ మైనార్టీల ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లోనివే. ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవాలంటే ఐఎస్‌ఎఫ్‌ సాయం తప్పనిసరి అవుతోందని సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి మహారాష్ట్రలో భాజపాను అధికారానికి దూరంగా ఉంచటానికి కాంగ్రెస్‌-ఎన్సీపీలతో శివసేన కలసినట్లుగా.. ఇక్కడ కూడా జరగొచ్చనేది సంయుక్త మోర్చా నేతల ఆశ!

ఇదీ చదవండి:

కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

'కింగ్​ మేకర్' ఆశలతో కూటమి అస్తిత్వ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.