అసోం గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జనావాస ప్రాంతంలోకి భారీ సంఖ్యలో వచ్చిన గజరాజులను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి.
స్థానికుల ఇళ్లపై దాడి చేసిన తర్వాత ఆ ఏనుగుల గుంపు... టీ తోటల్లోకి వెళ్లిపోయింది. అనంతరం 39వ జాతీయ రహదారిని దాటుతుండగా... వాటిని తరిమేందుకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కొన్ని ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి.
ఇదీ చూడండి: 'వారి రాజకీయాలతో బంగాల్ వైభవానికి విఘాతం'