తమిళనాడు ఈరోడ్ జిల్లాలో (Erode District news) ఉన్న బన్నారి అమ్మన్ మందిరంలోకి (Amman Temple in Tamilnadu) ఓ అడవి ఏనుగు చొరబడింది. సమీపంలో ఉన్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఈ గజరాజు వచ్చినట్లు తెలుస్తోంది. మందిరం పరిసరాల్లో తిరిగిన ఏనుగు.. అక్కడి ద్విచక్ర వాహనాన్ని, ఓ తోపుడు బండిని ధ్వంసం (Elephant Destroys) చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే మందిరం వద్దకు చేరుకున్న అధికారులు.. ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనం, తోపుడు బండి ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఓ దశలో అధికారులపైకి ఏనుగు దూసుకొచ్చింది.
అరగంట పాటు ప్రయత్నించిన అనంతరం ఏనుగును.. అడవిలోకి తిరిగి పంపించగలిగారు అధికారులు. గజరాజును భయపెట్టేందుకు టపాసులు కాల్చారు.
ఇదీ చదవండి: ఒక్కరాత్రిలో 21 శునకాలు మృతి- అసలేమైంది?