ETV Bharat / bharat

కుంభమేళాపై అఖాడాల దారెటు- ముందుగానే ముగిస్తారా? - ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం

హరిద్వార్​లోని కుంభమేళాకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరుకావడంపై విమర్శలు చెలరేగాయి. కుంభమేళాకు హాజరైన వారిలో చాలా మంది ప్రజలు, సాధువులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కుంభ్​ను ముగిస్తున్నట్లు శుక్రవారం నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయంపై మిగతా 12 అఖాడాలు విమర్శాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

kumbh mela, haridwar kumbh
కుంభమేళా, కుంభమేళాలో కొవిడ్
author img

By

Published : Apr 17, 2021, 4:25 PM IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో.. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ కుంభమేళా నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కుంభమేళాకు లక్షల్లో హాజరైన ప్రజలు, వేల సంఖ్యలో వస్తున్న సాధువుల్లో కొందరు కొవిడ్​ బారిన పడటం ఆందోళనకరంగా మారింది. 11 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళా.. సాధారణంగా 5 నెలల పాటు నిర్వహించాలి. కానీ, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా చరిత్రలో మొదటిసారిగా కుంభమేళాను నెలరోజులే జరపాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను మరింత త్వరగా ముగించనున్నట్లు తెలుస్తోంది.

ముందుగానే ముగిస్తారా?

ఏప్రిల్​ 30 వరకు కుంభమేళా ఘనంగా సాగుతుందని ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి తీరథ్​ సింగ్ రావత్ ఇటీవలే స్పష్టం చేశారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కుంభమేళా కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరోవైపు కుంభమేళా నేపథ్యంలో ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గత ఐదు రోజుల్లో 8,765 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 50 మంది వైరస్​కు బలయ్యారు.

గత ఐదు రోజ్లులో ఉత్తరాఖండ్​లో కేసులు..

తేదీ(ఏప్రిల్) కేసులు మరణాలు
11 1333 8
121334 7
131925 13
141953 13
152220 9

సాధువుల్లో​ వేగంగా వైరస్ వ్యాప్తి..

కుంభమేళాకు హాజరైన వారిలో 60 మందికిపైగా సాధువులు వైరస్​ బారినపడ్డారు. అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడాకు చెందిన 17 మంది సాధువులకు పాజిటివ్​గా తేలింది. నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి మహారాజ్​కూ వైరస్​ సోకింది.

ఏప్రిల్​ 11 నుంచి అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి మహారాజ్ ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. మొత్తంగా వేరు వేరు అఖడాలకు చెందిన చాలా మంది సాధువులు వైరస్​ లక్షణాలతో ఉండటం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి:కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్​

చివరి ఐదు రోజుల్లో..

ఏప్రిల్ 16: నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి, 17 మంది ఇతర సాధువులకు వైరస్​ సోకినట్లు స్పష్టమైంది.

ఏప్రిల్ 15: మొత్తంగా 9 మందికి వైరస్​ సోకింది. ఇందులో జునా అఖాడా(4), ఆహ్వాన్ అఖాడా(2), నిరంజని అఖాడా(3) సాధువులు ఉన్నారు.

ఏప్రిల్ 14: 31,308 మందిని పరీక్షించారు. ఇందులో జునా అఖాడాకు చెందిన నలుగురు సాధువులకు, అగ్ని మహానిర్వాని, దిగంబర్-అని అఖాడాలకు చెందిన ఇద్దరు సాధువులకు, అనంద్ అఖాడాకు చెందిన ఓ సాధువుకు వైరస్ నిర్ధరణ అయింది.

ఏప్రిల్ 13: మొత్తంగా 29, 825 టెస్టులు నిర్వహించగా జునా అఖాడాలో (5), నిరంజని అఖాడాకు చెందిన ముగ్గురు సాధువులకు పాజిటివ్​గా తేలింది.

ఏప్రిల్ 12: 26,694 టెస్టులు నిర్వహించగా ఆరుగురు సాధువులకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

ఏప్రిల్ 11: 23,394 మందిని పరీక్షించగా జునా అఖాడాకు చెందిన ఇద్దరు, నిరంజని అఖాడాకు చెందిన ఓ సాధువుకు వైరస్​ సోకినట్లు వెల్లడైంది.

ఏప్రిల్ 3: క్రిష్ణా ధామ్​కు చెందిన ఏడుగురు సాధువులకు వైరస్​ ఉన్నట్లు తేలింది.

ఇదీ చదవండి:'కుంభమేళాతో కొవిడ్ వ్యాప్తి మరింత ఉద్ధృతం'

వెంటనే నిర్ణయం!

మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కొవిడ్ కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో సాధువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ హఠాత్​పరిణామం అనంతరమే.. కుంభమేళాను ముగిస్తున్నట్లు 13 అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడా ప్రకటించింది.

"కొవిడ్​ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ నేపథ్యంలో నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా మహారాజ్​లు కుంభమేళా నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఏప్రిల్​ 17 తర్వాత పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం జరగదు. బయటినుంచి వచ్చిన సాధువులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. హరిద్వార్​లోని సాధువులు తమ అఖాడాలకు వెళ్తారు."

--కైలాశానంద్ గిరి, నిరంజని అఖాడా మహామండలేశ్వర్.

"కుంభమేళాను ముగించాలని నిరంజని అఖాడా నిర్ణయం తీసుకుంది. హరిద్వార్​లో కేసులు తీవ్రంగా పెరుగుతున్నందున.. ఏప్రిల్​ 27న జరిగే పుణ్య స్నానానికి నిరంజని అఖాడా తరఫున 15-20 సాధువులు మాత్రమే హాజరవుతారు. భక్తులు, సాధువులు తిరిగి తమ సొంత ప్రదేశాలు వెళ్లాలని కోరుతున్నాం."

--రవీంద్ర పూరి మహారాజ్, నిరంజని అఖాడా కార్యదర్శి.

నిరంజని అఖాడాపై విమర్శలు..

నిరంజని అఖాడా నిర్ణయాన్ని మిగిలిన 12 అఖాడాలు వ్యతిరేకించాయి. కుంభమేళాను నిలిపివేసే హక్కు నిరంజని అఖాడాకు లేదని స్పష్టం చేశాయి. కుంభమేళాను రద్దు చేసే హక్కు ముఖ్యమంత్రికి మాత్రమే ఉందని, చేసిన పొరపాటుకు నిరంజని అఖాడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

అయితే.. ఎవరి అనుమతి తీసుకోకుండానే కుంభమేళాను ముగించాలనే ప్రకటన చేశారని బారా ఉదాసిన్ అఖాడా ఆరోపించింది. ఇది సరైన నిర్ణయం కాదని మహేశ్వర్ దాస్ మహారాజ్ పేర్కొన్నారు. జగద్గురు శంకరాచార్య స్వరూపానంద్ సరస్వతి కూడా నిరంజన్ అఖాడా నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.

"కుంభమేళా ఒక్కరికి మాత్రమే సంబంధించింది కాదు దీని నిర్వహణపై అందరికీ అధికారం ఉంటుంది. ఎవరికి నచ్చిన నిర్ణయాలు వారు తీసుకోవడానికి లేదు. తొలుత నిర్ణయించిన తేదీ వరకు కుంభమేళా తప్పక నిర్వహించాలి. కుంభమేళా ముగిసేవరకు జగద్గురు శంకారాచార్య హరిద్వార్​లోనే ఉంటారు. కొవిడ్​ దృష్ట్యా పెద్ద కార్యక్రమాలను మాత్రమే ఆయన నిలిపివేశారు."

--అవిముక్తేశ్వరానంద్, జగద్గురు శిష్యుడు.

మరోవైపు కుంభమేళా ముగింపుపై జుగా అఖాడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొవిడ్​ రిపోర్టులు వచ్చిన తర్వాత సాధువులు సమావేశమై ఓ తుది నిర్ణయానికి రానున్నారు.

ఇదీ చదవండి:కరోనాతో ముందే ముగియనున్న కుంభమేళా!

హరిద్వార్​లోనే గత ఐదు రోజుల్లో..

హరిద్వార్​లో ఐదు రోజుల వ్యవధిలోనే 2,526 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

తేదీ(ఏప్రిల్)కేసులు మరణాలు
11386 0
12408 2
13594 1
14525 2
15613 1

ముందుగానే హెచ్చరించినా!

నీటితో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. దీని దృష్ట్యా కుంభమేళా నిర్వహణ సరికాదని ఆరోగ్య నిపుణులు మొదట్లోనే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనలను బేఖాతరు చేసింది. కొవిడ్​-19 నిబంధనలు నిక్కచ్ఛిగా అమలు చేస్తూ మేళా జరుపుతామని హామీ ఇచ్చింది. కానీ, పరిస్థితులు ప్రభుత్వం ఊహకంటే భిన్నంగా మారాయి.

"వైరస్​ ఉద్ధృతి దృష్ట్యా.. కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలను వేడుకుంటున్నాం. లక్షల్లో ప్రజలు కుంభమేళాకు హాజరవుతుంటే.. నిబంధనలను ఉల్లంఘించే వారిని శిక్షించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఒకవేళ అధికారులు మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలని ప్రజలను ఒత్తిడి చేసినా పరిస్థితులు వేరేలా మారుతాయి. కుంభమేళా కారణంగా కొవిడ్ ఉద్ధృతి మరింత పెరిగింది."

--సంజయ్ గుంజ్యాల్, కుంభమేళా ఐజీ.

పోలీసులపై ప్రభావం..

మహా కుంభమేళాకు విధులు నిర్వహించిన ప్రతి 10 వేల మందిలో 33 మందికి పాజిటివ్​గా తేలింది. 'అయితే రానున్న రోజుల్లో పుణ్య స్నానాలకు అన్ని అఖాడాలు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో 50 శాతం పోలీసు సిబ్బందిని విధులనుంచి తొలగించనున్నాం' అని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.

11 ఏళ్లకే..

మొదటిసారిగా కుంభమేళాను 12 ఏళ్లకు కాకుండా 11 ఏళ్ల తర్వాతే నిర్వహించారు. వాస్తవానికి 2022లో ఈ కుంభమేళా జరగాల్సింది.

నాలుగు ప్రాంతాల్లో..

ప్రయాగ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్ ప్రాంతల్లో ఈ కుంభమేళా జరుగుతుంది.

ప్రధాని ఏమన్నారంటే?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా విజ్ఞప్తి చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని కోరారు. ఈ మేరకు జునా అఖాడాకు చెందిన స్వామి అవదేశానందగిరితో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

అయితే.. ప్రస్తుతం భక్తులు ఎవరూ పుణ్యస్నానాలకు హాజరు కావడం లేదని కేవలం సాధువులే ఈ స్నానాలకు హాజరవుతున్నారని స్వామి అవదేవానందగిరి బదులిచ్చారు. మోదీ పిలుపును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య దృష్ట్యా కుంభమేళాను ముందుగానే ముగిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.