ETV Bharat / bharat

'ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి' - కిసాన్ మహా పంచాయత్​

ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. హరియాణాలో నిర్వహించిన ' కిసాన్​ మహా పంచాయత్​'లో ఆయన ప్రసంగించారు. ప్రజలు ఒకే దగ్గర గుమిగూడినంత మాత్రాన అది చట్టాల రద్దుకు దారితీయదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

When crowds gather, govts get changed: BKU leader Rakesh Tikait at farmers' mahapanchayat
'ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి'
author img

By

Published : Feb 22, 2021, 7:57 PM IST

ప్రజలంతా ఒకే తాటిపైకి వస్తే ప్రభుత్వాలు మారిపోతాయని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ తెలిపారు. హరియాణా సోనిపట్​ జిల్లా ఖార్కొడాలో ఏర్పాటు చేసిన 'మహా పంచాయత్​'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనమంతా ఒకే దగ్గర గుమిగూడినంత మాత్రాన అది చట్టాల రద్దుకు దారితీయదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

'అధికారం కష్టం'

రైతు చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో కొనసాగటం కేంద్రానికి కష్టమవుతుందన్నారు టికాయిత్​. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. రైతు చట్టాలతో పాటు విద్యుత్ చట్టం, విత్తన చట్టం, పెట్రోల్, డీజిల్​ ధరలు పెరుగుదలు.. తదితర వాటిపై కేంద్రంపై విమర్శలు చేశారు టికాయిత్​.

"సొంత పంటలను త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వాలు లెక్క కాదని తెలుసుకోవాలి. ఈ ఉద్యమం కేవలం రైతుల కోసం కాదు. పేదలు, రోజూ వారీ కూలీల కోసం కూడా. ఇలాంటి చట్టాలు పేద ప్రజల్ని ఇంకా పేదరికంలోకి నెట్టేస్తాయి. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకొస్తేనే రైతుకు సంరక్షణ. ఈ ఉద్యమం రైతుల హక్కులను కాపాడేందుకే.. "

-- బీకేయూ నేత రాకేశ్ టికాయిత్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ గ్వాలియర్​లో రైతు చట్టాలపై ఆదివారం మాట్లాడుతూ... రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని అన్నారు. జనం గుమిగూడినంత మాత్రాన.. అది చట్టాలను రద్దు చేయటానికి దారితీయవన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాల్లో... ఏ అంశం రైతులకు వ్యతిరేకంగా ఉందో రైతు సంఘాలు ప్రభుత్వానికి చెప్పాలని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : 'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.