ETV Bharat / bharat

దేశంలో ఒమిక్రాన్​ 'పీక్​' ఎప్పుడు? భారత్​ సిద్ధమేనా? - ఒమిక్రాన్​ వార్తలు

Omicron's peak stage in India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరే అవకాశముందని.. ఈటీవీ భారత్​తో జరిగిన సంభాషణలో వైరాలజిస్ట్​ జాకబ్​ జాన్​ అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్​ తీవ్రతను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

virologist on Omicron Variant
దేశంలో ఒమిక్రాన్​ 'పీక్​' ఎప్పుడు? భారత్​ సిద్ధమేనా?
author img

By

Published : Dec 14, 2021, 7:34 PM IST

Omicron's peak stage in India: ఒమిక్రాన్​తో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్​తో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. భారత్​లోనూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్​ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై ప్రముఖ వైరాలజిస్ట్​ జాకబ్​ జాన్​.. ఈటీవీ భారత్​తో మాట్లాడారు. ఆ వివరాలు..

ఒమిక్రాన్​ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధమేనా?

భారత్​ సిద్ధమే. కరోనా రెండు దశలను భారత్​ ఎదుర్కొంది. సమస్యను ఏ విధంగా అధిగమించాలో రాష్ట్రాలకు అర్థమైంది. మూడో దశ కోసం రాష్ట్రాలు ముందే సన్నద్ధమయ్యాయి కదా.

దేశంలో ఒమిక్రాన్​ కేసులు ఎప్పుడు తారస్థాయికి చేరతాయి?

గత నెలలో ఒమిక్రాన్​.. దేశంలోకి వచ్చింది. దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. అందువల్ల దేశంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కేసులు తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.

గత వేరియంట్లకు 7 రోజుల క్వారంటైన్​ ఉంటుంది. కానీ ఒమిక్రాన్​కు అది 14రోజులు. మరి నమోదయ్యే కేసులకు తగ్గట్టు.. దేశంలో సరిపడా పడకలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా?

వాస్తవానికి.. తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి హోం క్వారంటైన్​ సరిపోతుంది. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదు. 2022 ప్రథమార్థంలో కేసులు పెరిగితే.. అందుకు తగ్గట్టు పడకలు ఉన్నాయి. అయితే పిల్లలపైన ఎక్కువ దృష్టిపెట్టాలి. వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 7రోజుల క్వారంటైన్​ తర్వాత ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నిర్వహించవచ్చు. అందులో నెగిటివ్​ వస్తే ఆ వ్యక్తిలో వైరస్​ లేనట్టే. కచ్చితంగా 14రోజులు ఉండాల్సిన అవసరం లేదు.

Indian omicron news:

మరో వేవ్​ వస్తే.. దేశంలో లాక్​డౌన్​ విధించాలా?

ఇంకో 'వేవ్​' రావడం దాదాపు అసాధ్యం. కేసులు కొద్దిగా పెరుగుతాయని మేము అనుకుంటున్నాము. దేశ జనాభాలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న తర్వాత ఒమిక్రాన్​ వచ్చింది. పిల్లల్లో వ్యాధి సోకే అవకాశముంది. దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్​డౌన్​ అవసరమే ఉండదు.

టీకా తీసుకోని వారిలో ఒమిక్రాన్​ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది?

ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు. టీకా తీసుకోని వారిలో చాలా మందికి కరోనా, డెల్టా సోకి ఉండొచ్చు. అందువల్ల టీకా తీసుకోని ప్రజలందరినీ ఒకే విధంగా చూడలేము. గర్భం, కేన్సర్​, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశముంది. టీకా పంపిణీని మరింత పెంచాలి. అందరూ రెండు డోసులు వేసుకునే విధంగా ప్రోత్సహించాలి. పిల్లలకు టీకాలు ఇవ్వాలి. అవసరమైతే బూస్టర్​ డోసు కూడా తీసుకురావాలి.

omicron India latest news

ఒమిక్రాన్​లో మ్యుటేషన్లు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నష్టం ఏమైనా ఉందా?

మ్యుటేషన్లు ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి నుంచి వైరస్​ తప్పించుకునే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. గతేడాది కొవిడ్​ బారిన ప్రజలు, రెండో డోసు తీసుకుని ఆరు నెలలు దాటిపోయిన వారికి రక్షణ తగ్గుతుందని అనుకుంటున్నాము. అదే సమయంలో.. మ్యుటేషన్లు ఎక్కువగా ఉండేసరికి.. ఒమిక్రాన్​ అంత ప్రమాదకరం కాకపోవచ్చని మేము భావిస్తున్నాము.

అసలు ఈ మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుంది?

2019 డిసెంబర్​ నుంచి 2020 ఏప్రిల్​ మధ్య కాలంలో మహమ్మారి వివిధ దేశాలకు విస్తరించింది. మహమ్మారి అంతం కూడా అస్థిరంగానే ఉంటుంది. ఇప్పటికే భారత్​, తైవాన్​, జపాన్​ మహమ్మారి ఎపిడమిక్​ దశ ముగింపునకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎండెమిక్​ (తక్కువ స్థాయిలో కేసులు ఉండటం) దశలో ఉన్నాయి. నా అంచనా ప్రకారం.. 2022 ప్రథమార్థం ముగిసే నాటికి.. మహమ్మారి అంతమవుతుంది. కానీ ఈ వైరస్​ ఎండెమిక్​లాగా(జలుబు, ఫ్లూ).. మనుషుల్లో ఉండిపోతుంది. టీకాలు వేసుకోవడం మాత్రం ముఖ్యం.

ఇదీ చూడండి:- దిల్లీలో పెరిగిన ఒమిక్రాన్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.