ETV Bharat / bharat

'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్​కు రూ.25లక్షలు లాస్! - cyber frauds in india

గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వీడియో కాల్​ ఆన్సర్ చేయడమే ఆ ఇంజినీర్​ కొంపముంచింది. ఏకంగా రూ.25లక్షలు నష్టానికి కారణమైంది. ఇంతకీ ఏమైంది? ఎక్కడ?

cyber frauds in india
'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్​కు రూ.25లక్షలు లాస్!
author img

By

Published : Aug 2, 2022, 8:59 AM IST

సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.25లక్షలు పోగొట్టుకున్నాడు ఒడిశాకు చెందిన ఓ ఇంజినీర్. సమాజానికి భయపడి తొలుత మౌనంగా ఉండిపోయిన అతడు.. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
వాట్సాప్​తో మాయాజాలం:
బాధితుడు.. భువనేశ్వర్​లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్​ఎన్​ఎల్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్​లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ సందేశం ఎవరు పంపారా అని ఆలోచిస్తుండగానే వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేసి చూస్తే.. అవతలి వైపున ఓ మహిళ నగ్నంగా ఉంది. ఏవేవో కబుర్లు చెబుతోంది. వెంటనే కాల్ కట్ చేశాడు ఆ ఇంజినీర్.

అప్పటికే రికార్డ్ అయిన వాట్సాప్ వీడియో కాల్​ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. నగ్నంగా ఉన్న మహిళతో ఇంజినీర్ మాట్లాడుతున్న వీడియోను మార్ఫ్​ చేశారు. రూ.25లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భయపడిన ఇంజినీర్.. వారు అడిగిన డబ్బు సమర్పించుకున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంపై భువనేశ్వర్​లోని సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ న్యూడ్ కాల్స్​తో సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు గుంజుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవల హైదరాబాద్​ అశోక్‌నగర్‌లో ఉంటున్న ఒక వైద్యుడికి నేరుగా వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ఒక యువతి మాట్లాడింది. రెండ్రోజులు అలా సాగాక.. దుస్తులన్నీ తీసేసి మాట్లాడమంది. ఎవరూ లేరుకదా అని అతను నగ్నంగా మారి సంభాషించాడు. చివరకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.