ETV Bharat / bharat

లక్షద్వీప్​లో రాజకీయ రగడ- అసలేం జరుగుతోంది? - దినేశ్వర్ శర్మ

సుందరమైన ద్వీప సమూహంలో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. లక్షద్వీప్​ పాలనాధికారిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్విట్టర్​లో 'సేవ్ లక్షద్వీప్' హ్యాష్​ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల నియమించిన పాలనాధికారిని తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ పరిణామాలకు కారణమేంటి? అసలు అక్కడేం జరుగుతోంది?

what is happening in lakshadweep
లక్షద్వీప్​లో రాజకీయ రగడ- అసలేం జరుగుతోంది?
author img

By

Published : May 25, 2021, 10:07 PM IST

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్​లో ప్రభుత్వ యంత్రాంగంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ద్వీప సమూహంలో నివసించే ప్రజలు ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్కృతి, జీవనవిధానాన్ని కాపాడుకునేందుకు గళమెత్తుతున్నారు.

సమస్య ఏంటి?

2020 డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించారు. ఆయన స్థానంలో గుజరాత్ మాజీ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితుడైన ప్రఫుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. దమణ్, దీవ్​లకు పాలనాధికారిగా ఉన్న ఈయనకే లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయని సమాచారం.

లక్షద్వీప్ ప్రజలు తమ సంస్కృతిని గొప్పగా భావిస్తారు. ప్రకృతిని కాపాడుకోవడాన్ని తమ బాధ్యతగా పరిగణిస్తారు. ఈ కేంద్రపాలిత ప్రాంత రక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మద్యం విక్రయాలు ఉండవు. బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేసే అధికారం ఉండదు. స్థానికేతరులు ఇక్కడికి రావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఆ చట్టాలతో పేచీ!

ప్రఫుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన.. లక్షద్వీప్ జంతు సంరక్షణ చట్టం, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల చట్టం, డెవెలప్​మెంట్​ అథారిటీ చట్టం, పంచాయతీ సిబ్బంది నియమాల సవరణ వంటి చట్టాలు ప్రజల ఆగ్రహానికి లోనవుతున్నాయి. ఎవరినైనా నిర్బంధించేలా పోలీసులకు అధికారాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల నుంచి దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరుగుతోంది. 'సేవ్ లక్షద్వీప్' పేరుతో ట్విట్టర్​లో హ్యాష్​ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేరళలోని అధికార విపక్ష కూటములు లక్షద్వీప్ వాసులకు మద్దతుగా ప్రకటనలు కూడా చేస్తున్నారు.

మైనింగ్​కు వ్యతిరేకం

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతిశీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారాలను డెవెలప్​మెంట్​ అథారిటీ చట్టం కల్పిస్తుంది. భూమిని అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. మైనింగ్, ఇంజినీరింగ్, భవన నిర్మాణాలు చేపట్టే వీలు కల్పిస్తుంది. అయితే, జీవజాతులు భాసిల్లే ఈ ద్వీపాలలో అభివృద్ధి పేరిట మైనింగ్, క్వారీయింగ్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈ చట్టం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంలోని భూములను పార్కులు, పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలుగా వర్గీకరించే అధికారం పాలకులకు లభిస్తుంది. వర్గీకరణ తర్వాత ఆక్రమిత భూముల్లో ఉంటున్నట్లు తేలిన వారి నివాసాలను తొలగించే అవకాశం ఉంది.

రోడ్ల విస్తరణ

మరోవైపు, ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని పటేల్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేయమని ఆదేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. లక్షద్వీప్​లో ఉన్న వాహనాల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఉన్నవి ద్విచక్రవాహనాలే! అలాంటప్పుడు ఇళ్లు తొలగించి మరీ రోడ్ల విస్తరణ చేపట్టే అవసరమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

బీఫ్ నిషేధం

లక్షద్వీప్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని డెయిరీ ఫామ్​లను నూతన పాలనాధికారి పటేల్ మూసేయించినట్లు తెలుస్తోంది. గోవధను నిషేధించం, బీఫ్ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోళ్లను నివారించేందుకే ఇలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో మాంసాహార మెనూను సైతం తొలగించారని ద్వీపవాసులు వాపోతున్నారు.

ఇద్దరు పిల్లలు

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధన విధించేలా నూతన చట్టం ప్రతిపాదించారు పటేల్. లక్షద్వీప్​లో సంతానోత్పత్తి రేటు 1.6 మాత్రమే. ఇలాంటి ప్రాంతంలో ఈ నిబంధన విధించడంపై అక్కడి ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. కొందరు ప్రముఖ నేతలను పోటీ నుంచి తప్పించేందుకే ఈ నిబంధన పెట్టారని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.

కేరళను దూరం చేయాలని!

కేరళలోని కొచ్చికి 150-200 మైళ్ల దూరంలో ఈ లక్షద్వీప్ ఉంది. 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తారు. ఇక్కడి జనాభా సుమారు 64 వేలు. ఇందులో ముస్లింలను షెడ్యూల్ తెగలుగా పరిగణిస్తారు. లక్షద్వీప్ ప్రజలంతా మలయాళ మాండలికమైన జెసెరీ భాష మాట్లాడతారు. మినికోయ్ ప్రజలు మాత్రం మహాల్ అనే భాష ఉపయోగిస్తారు. విద్య, వైద్యం కోసం వీరు ప్రధానంగా కేరళపై ఆధారపడతారు.

కేరళ నుంచి లక్షద్వీప్​నకు సంబంధాలు తెంచేయాలని పాలనాధికారి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కేరళకు చెందిన ఎంపీ ఎలామారం కరీమ్ ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు.

కరోనా..

ప్రపంచం మొత్తం కరోనాతో కుదేలైన 2020 ఏడాదిలో లక్షద్వీప్​లో ఒక్క కేసూ నమోదు కాలేదు. పటేల్​ రాక ముందు అమలైన ఆంక్షలను.. ఆయన వచ్చాక సడలించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో తొలి కేసు బయటపడింది. ఆ తర్వాత కరోనా విలయతాండవం చేసింది. పాజిటివిటీ రేటు 60శాతం దాటింది. మొత్తంగా ఇప్పటివరకు 6500 కేసులు నమోదయ్యాయి. 24 మంది మరణించారు.

ఇదీ చదవండి- కరోనాలేని లక్షద్వీప్- ఎలా సాధ్యమైంది?

రాజకీయ నేతని నియమిస్తారా?

కేంద్రపాలిత ప్రాంతానికి పాలనాధికారిగా రాజకీయ నేతను నియమించడమే ఈ దుస్థితికి కారణమని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసింది.

"సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లక్షద్వీప్ పాలనాధికారిగా నియమిస్తారు. ఈ నిబంధనను తొలిసారి ఉల్లంఘించి శ్రీ ప్రఫుల్ పటేల్​ను నియమించిన తర్వాత నుంచి ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అనేక తుగ్లక్ విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో మాంసాహారాన్ని నిషేధించారు. చిన్న ఐలాండ్​లో రోడ్ల విస్తరణ చేపట్టారు. దీని వల్ల అక్కడి సంస్కృతి, వైవిధ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు మీరు(రాష్ట్రపతి) కల్పించుకోకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయి."

-రమేశ్ చెన్నితలా, కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ

ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలనాధికారిని తొలగించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఆయన చేపట్టిన చర్యలు ద్వీప సమూహానికి చేటు చేశాయని ఆరోపించారు.

అవినీతిపైనే పోరాటం

మరోవైపు, భాజపా పటేల్​ను వెనకేసుకొచ్చింది. లక్షద్వీప్​లోని అవినీతి నేతలపైనే పటేల్ చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్లాకుట్టి పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ చర్యల పట్ల సంతృప్తిగానే ఉన్నారని చెప్పారు. వార్తా ఛానెళ్లు, సామాజిక మాధ్యమాలే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు చూపిస్తున్నాయని ఆరోపించారు. నిజం తెలుసుకోకుండానే ఎంపీలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి- బ్రహ్మపుత్ర ప్రాజెక్టుకు నీటి గండం- చైనా బెంబేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.