ETV Bharat / bharat

బంగాల్​ ఎన్నికల ప్రచారంపై మరిన్ని ఆంక్షలు - బంగాల్​ ఐదో విడత ఎన్నికలు

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు బంగాల్​లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించకూడదని తెలిపింది.

election commission
బంగాల్​ ఎన్నికలు
author img

By

Published : Apr 16, 2021, 8:11 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా బంగాల్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం(ఈసీ) మరిన్ని ఆంక్షలు విధించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. ఆ సమయంలో ర్యాలీలు, వీధుల్లో ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇంతకు ముందు ఈ సమయం 48 గంటలుగా ఉండేది.

తాజా ఆదేశాలు.. బంగాల్‌లో జరగనున్న 6, 7, 8వ విడతల పోలింగ్‌కు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 8 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేయగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తయ్యాయి. శనివారం 5 వ విడత పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి:బంగాల్​ ఎన్నికల అభ్యర్థులపై కరోనా పంజా

ఇదీ చూడండి:45 స్థానాల్లో ఐదో దశ పోలింగ్​కు 'బంగాల్​' సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.