ETV Bharat / bharat

బంగాల్ మూడో దశ అభ్యర్థుల్లో 26% నేరచరితులే.. - ఏడీఆర్​ నివేదిక

బంగాల్​ శాసనసభకు జరగనున్న మూడో దశ ఎన్నికల్లో.. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 26శాతం మంది నేరచరిత్రను కలిగి ఉన్నట్లు 'అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రీఫామ్స్​​' నివేదిక స్పష్టం చేసింది. వీరంతా క్రిమినల్​ కేసులు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

Bengal polls
బంగాల్ మూడో దశ పోలింగ్​
author img

By

Published : Apr 5, 2021, 5:04 AM IST

Updated : Apr 5, 2021, 6:00 AM IST

బంగాల్​ శాసనసభ మూడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 205 మంది అభ్యర్థుల్లో 26 శాతం మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) స్పష్టం చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది.

Bengal polls
పార్టీల వారిగా అభ్యర్థుల నేరచరిత

ఏడీఆర్​ నివేదిక వివరాలు..

  • 102(50 శాతం) మంది అభ్యర్థులు 12వ తరగతి వరకు చదువుకున్నారు.
  • 53(26 శాతం) మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులున్నాయి.
  • 43(21 శాతం) మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కుంటున్నారు.
    Bengal polls
    క్రిమినల్​ కేసుల్లో టాప్​-5లో ఉన్న అభ్యర్థులు
  • 33 మంది అభ్యర్థులు కోటీశ్వరులుగా పేర్కొన్నారు.

మొత్తంగా 31 నియోజకవర్గాల్లో 205 మంది అభ్యర్థులు ఏప్రిల్​ 6న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 193 మంది పురుషులు కాగా 12 మంది మహిళా అభ్యర్థులున్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారానికి తెర- మంగళవారం పోలింగ్

Last Updated : Apr 5, 2021, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.