ETV Bharat / bharat

భవానీపుర్​ ఉపఎన్నికలో మార్పు లేదు.. హైకోర్టు స్పష్టం - బంగాల్​ ఉపఎన్నికలు

Bhabanipur bypolls
భవానీపుర్​ ఉపఎన్నిక
author img

By

Published : Sep 28, 2021, 11:33 AM IST

Updated : Sep 28, 2021, 1:24 PM IST

11:28 September 28

భవానీపుర్​ ఉపఎన్నికలో మార్పు లేదు.. హైకోర్టు స్పష్టం

బంగాల్​ భవానీపుర్​ ఉపఎన్నిక (Bhawanipur election) షెడ్యూల్​ ప్రకారమే జరగాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నిక వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను తాత్కాలిక సీజే జస్టిస్​ రాజేష్​ బిందాల్​, జస్టిస్​ ఆర్​. భరద్వాజ్​ సభ్యులుగా గల ధర్మాసనం.

అయితే ఎన్నిక జరగాలని బంగాల్​ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(సీఎస్​).. ఈసీకి లేఖ రాయడం కూడా సరైనది కాదని తేల్చిచెప్పింది.

భవానీపుర్​లో పోలింగ్​(Bhawanipur election) జరగకుంటే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని, ఆ లేఖలో పేర్కొన్నారు సీఎస్​.  

భవానీపుర్​లో సెప్టెంబర్​ 30న పోలింగ్​ జరగనుంది. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్​ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 

ఘర్షణ..

సోమవారం నిర్వహించిన ఉపఎన్నికల(Bhabanipur Bypoll) ప్రచారంలో అధికార టీఎంసీ(TMC Party), భాజపా(Bengal BJP) కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల ప్రచారానికి హాజరైన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు(BJP National Vice President), పార్టీ ఎంపీ దిలీప్​ ఘోష్​ను(Dileep Ghosh BJP) టీఎంసీ కార్యకర్తలు ఘోరావ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ కనిపించటం కలకలం రేపింది.

ఈ గొడవపై స్పందించిన భాజపా.. ఘోష్​పై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించింది. ఓటమి భయంతోనే దాడులకు దిగుతున్నారని, ఈ నేపథ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఉపఎన్నికను(Bhawanipur election) వాయిదా వేయాలని ఘోష్ డిమాండ్ చేశారు. 

ఈ ఆరోపణలు తిప్పికొట్టిన టీఎంసీ.. భవానీపుర్​లో భాజపాకు (Bhabanipur bjp candidate) ఎలాంటి బలం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

ఘటనపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన దీదీ సర్కారు.. ఘటన వివరాలు, వీడియో ఫుటేజీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. వీటిని దిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: ఆ నియోజకవర్గంలో పీకేకు ఓటు- రెండు పార్టీల మాటల యుద్ధం

భవానీపుర్​లో టీఎంసీ- భాజపా మధ్య ఘర్షణ

Last Updated : Sep 28, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.