బంగాల్ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 44 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ జరగనుంది. మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
బరిలో ఉన్న ప్రముఖులు..
భారీ భద్రత..
ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 789 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఒక్కో కంపెనీలో 100 మంది సభ్యులు ఉంటారు. కూచ్ బెహార్ నియోజకవర్గానికి అత్యధికంగా 187 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను పంపింది. ఇటీవల వివిధ పార్టీల నేతలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'ఓటమి భయంతోనే మమత దుష్ప్రచారం'