ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి- ప్రధాని విచారం

author img

By

Published : Jan 20, 2021, 7:41 AM IST

Updated : Jan 20, 2021, 12:40 PM IST

accident in Dhupguri
ఘోర రోడ్డుప్రమాదం

07:34 January 20

రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి- ప్రధాని విచారం

West Bengal
రోడ్డు ప్రమాదం

పశ్చిమ్​ బంగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్​పాయీగుడీ జిల్లా ధుప్​గుడీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. ఓ రాళ్ల ట్రక్కు.. మారుతీ వ్యాన్​, టాటా మ్యాజిక్​ కార్లను ఢీకొట్టడం వల్ల  ఈ దుర్ఘటన జరిగింది.

పొగ మంచు కారణంగానే రోడ్డుపై వాహనాలు కనిపించలేదని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ప్రధాని విచారం..

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

Last Updated : Jan 20, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.