వయసుకు మించిన బరువుతో బాధపడుతున్న ఓ బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు దిల్లీ వైద్యులు. 12 ఏళ్ల వయసుకే 89 కిలోలు ఉన్న ప్రాచీ అనే బాలికకు బేరియాట్రిక్ సర్జరీ(bariatric surgery for girl) చేసి 15 కిలోల బరువును తగ్గించారు గాజియాబాద్ జిల్లాలోని(delhi ghaziabad heavy weight girl) ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
చిన్న వయసులోనే..
కొన్నేళ్లుగా ప్రాచీ బరువు పెరుగుతోంది. మొదట ఇది చూసి మంచిదే అనుకున్న తల్లిదండ్రులు ఆ తర్వాత ఆమె ఎదుగుదల చూసి ఆందోళన చెందారు. అధిక బరువుతో బాధపడుతున్న ప్రాచీ మంచం నుంచి లేవనేని స్థితికి చేరుకుంది. రెండేళ్లగా మంచంపైనే ఉండటం వల్ల ఆమె బరువు మరింత పెరిగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేది. ప్రాచీ ఆక్సీజన్ లెవెల్స్ 75 శాతానికి పడిపోయాయి. మధుమేహం కూడా వచ్చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వైద్యుల్ని సంప్రదించగా బేరియాట్రిక్ సర్జరీ చేయాలని సూచించారు.
ప్రాచీకి విజయంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆమె బరువు 15 కిలోలు తగ్గించారు. బాలికకు మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం లేదన్న డాక్టర్లు.. అవసరమైతే మందులు వాడితే సరిపోతుందన్నారు.
ఇదీ చూడండి : సెల్ టవర్ ఎక్కి టీచర్ ఆందోళన.. ఎందుకంటే?