ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జనవరి 30 - ఫిబ్రవరి 05) - horoscope today telugu eenadu

Weekly Horoscope: ఈ వారం (జనవరి 30 - ఫిబ్రవరి 05) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

weekly horoscope
ఈ వారం రాశిఫలం
author img

By

Published : Jan 30, 2022, 3:49 AM IST

Updated : Jan 30, 2022, 4:02 AM IST

Weekly Horoscope: ఈ వారం (జనవరి 30 - ఫిబ్రవరి 05) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..

మేషం..

ఉద్యోగ అంశాలు అనుకూలం. అదృష్ట యోగముంది. పనుల్ని సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారస్థితి మెరుగవుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. అనుకున్నది నెరవేరుతుంది. దేనికీ తొందరపడవద్దు. ఈర్ష్యపడేవారున్నారు. మౌనంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది.

వృషభం..

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకం ఎదురవుతుంది. పరి స్థితులు అనుకూలించేవరకూ ఓపికపట్టాలి. ఉద్యోగరీత్యా ఒత్తిడి గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసం అవసరం. ఇంట్లోవారితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. చెడు ఆలోచించవద్దు. అంతా మనమంచికే అన్న ధోరణి రక్షిస్తుంది. ఇష్టదైవారాధన ఉత్తమం.

మిథునం..

ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మస్థైర్యం రక్షిస్తుంది. మంచి మనసుతో ఆలోచించండి. కోరుకున్న ఫలితం సాక్షాత్కరిస్తుంది. ప్రశంసలుంటాయి. కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. అవి జీవితానికి పనికి వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సావధానచిత్తులై ముందుకు సాగాలి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచండి. లక్ష్మీధ్యానం శ్రేయస్కరం.

కర్కాటకం..

ఉత్తమ కార్యసిద్ధి గోచరిస్తోంది. తగిన విధంగా పని మొదలుపెట్టండి. కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితం లభిస్తుంది. అధికారుల అండ ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత పెంచండి. ప్రశాంతంగా ఆలోచిస్తే గొప్ప ఫలితాలు సాధించగలరు. సమష్టికృషి ఫలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. విష్ణుమూర్తిని స్మరిస్తే మంచిది.

సింహం..

అత్యుత్తమ కాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి మీ సొంతమవుతుంది. ఇంటా బయటా కలిసివస్తుంది. కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలున్నాయి. వ్యాపారలాభం సూచితం. దయాగుణంతో ఆలోచించండి. గృహవాహనాది లాభాలున్నాయి. ధనం వృద్ధి చెందుతుంది. ఇష్టదేవతను తలచుకోండి, ఆత్మసంతృప్తి కలుగుతుంది.

కన్య..

ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. శ్రమ ఫలిస్తుంది. ధనలాభముంది. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురవుతుంది. సమయ స్ఫూర్తితో పరిష్కరించాలి. కాలం మిశ్రమంగా ఉంది. మంచి భవిష్యత్తుకై వేచి చూడాలి. దగ్గరివారితో విభేదాలు వద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు.

తుల..

భాగ్యరేఖ విశేషంగా ఉంది. మీరనుకున్న విజయం లభిస్తుంది. మంచి కాలం మొదలైంది. సరైన నిర్ణయాలతో బంగారు జీవితాన్ని ఏర్పరచుకోండి. ఉద్యోగం అనుకూలం. వ్యాపారరీత్యా బాగుంటుంది. నూతనాంశాలు కలిసివస్తాయి. ఆర్థికపుష్టి లభిస్తుంది. పెద్దలవల్ల కీర్తి పెరుగుతుంది. పదవీలాభాలున్నాయి. మహాలక్ష్మీదేవిని స్మరించండి, శాంతి లభిస్తుంది.

వృశ్చికం..

ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. ప్రశాంతచిత్తంతో నిర్ణయం తీసుకుని లక్ష్యాన్ని సాధించాలి. ఆపదలనుంచి బయటపడతారు. ధర్మం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. సుఖసంతోషాలుఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. ఇష్టదైవధ్యానం మంచి చేస్తుంది.

ధనస్సు..

కృషి ఫలిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది. సహనం అవసరం. చంచలత్వం వద్దు. ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లాలి. మధ్యలో నిర్ణయం మార్చవద్దు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికాంశాలు బాగున్నాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని తలచుకోండి, అపార్థాలు తొలగుతాయి.

మకరం..

కార్యసిద్ధి ఉంది. మధ్యలో తెలియని అవాంతరాలున్నాయి. ఏకాగ్రత, ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఉద్యోగరీత్యా మిశ్రమ కాలం నడుస్తోంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఇబ్బంది పెట్టేవారున్నారు. మౌనమే రక్షిస్తుంది. వ్యాపారరీత్యా ఒడుదొడుకులున్నాయి. ఇంట్లోవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

కుంభం..

మనోబలంతో పనిచేయండి, విజయం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ఉన్నతస్థితి గోచరిస్తోంది. అన్నివిధాలా కలిసి వస్తుంది. పనుల్లో ఏమాత్రం జాప్యం పనికిరాదు. ధర్మదేవత రక్షిస్తోంది. ప్రశంసలుంటాయి. సమష్టిగా కృషిచేయాలి. వ్యాపారానుకూలత ఉంది. ధనలాభం సూచితం. దైవాను గ్రహంతో ఒక మంచి పని చేస్తారు. సూర్య దేవుడిని ప్రార్థించండి, శక్తి పెరుగుతుంది.

మీనం..

ఉత్తమమైన ఫలితాలున్నాయి. ఉద్యోగరీత్యా గొప్ప అభివృద్ధి సాధిస్తారు. ప్రతి బంధకాలు తొలగుతాయి. అధికారలాభం ఉంటుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారలాభం విశేషంగా ఉంది. మిత్రులవల్ల శాంతి లభిస్తుంది. ఆర్థికాంశాలు బాగున్నాయి. ఇంట్లో ఆనందంగా గడుస్తుంది. ఆంజనేయస్వామిని స్మరించండి, మంచి జరుగుతుంది.

Last Updated : Jan 30, 2022, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.