ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి20 - మార్చి 26) - ఈనాడు రాశి ఫలాలు

Weekly Horoscope: ఈ వారం (మార్చి20 - మార్చి 26) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు.

ఈ వారం రాశి ఫలాలు
Weekly Horoscope
author img

By

Published : Mar 20, 2022, 4:05 AM IST

Weekly Horoscope: ఈ వారం (మార్చి20 - మార్చి 26) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

మేషం

శుభఫలితం ఉంటుంది. విజయావకాశాలు పెరుగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేయండి. అనుకున్న స్థాయికి చేరతారు. ఆత్మీయుల ద్వారా కొన్ని పనులు ముందుకు సాగుతాయి. ఎదురుచూస్తున్న పని ఒకటి ఆనందాన్నిస్తుంది. దేనికీ వెనుకాడవద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి, ఆపదలు తొలగుతాయి.

వృషభం

ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. తొందర పనికిరాదు. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. కార్యాచరణ ధర్మబద్ధంగా ఉండాలి. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. పనిలో నైపుణ్యం అవసరం. అప్పుడే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. సమాజహితం కోసం ఆలోచించండి. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

మిథునం:

మంచికాలం నడుస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారరీత్యా శ్రద్ధ పెంచాలి. భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. లక్ష్యసాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు అవసరం. తొందరవద్దు. సన్మార్గంలో ఖ్యాతిని గడిస్తారు. ఆనందించే అంశముంది. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్సునిస్తుంది.

కర్కాటకం:

కాలం వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ధర్మమార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి. యోగ్యతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఇష్టదైవారాధన ఉత్తమం.

సింహం:

మంచి జరుగుతుంది. అవకాశాలు పెరుగుతాయి. ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుతారు. పదిమందికీ మేలుచేసే పనులు మొదలుపెట్టండి. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలున్నాయి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఈర్ష్యపడేవారున్నారు. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. శివధ్యానం మంచిది.

కన్య:

శుభఫలితాలున్నాయి. స్వయంకృషితో పైకి వస్తారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవరోధాలు తొలగుతాయి. మనోబలం దృఢంగా ఉంటుంది. సంపదలు పెంచే ఆలోచనలు వస్తాయి. గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. సూర్య నమస్కారం శుభప్రదం.

తుల:

అభిమానించేవారున్నారు. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. కోరికలు నెరవేరతాయి. వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అధిక లాభాలున్నాయి. తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒక ఆపద నుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు శక్తిని ఇస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి, మేలు చేకూరుతుంది.

వృశ్చికం:

అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఆశయం కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగపరంగా శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పదవీయోగం ఉంటుంది. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. దైవబలం రక్షిస్తుంది. పలుమార్గాల్లో లాభపడతారు. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది. లక్ష్మీధ్యానం మంచిది.

ధనుస్సు:

మనోబలం విజయాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సమయస్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు పొందాలి. నిరంతర కృషి అవసరం. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. స్పష్టత లోపించకూడదు. అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంజనేయస్వామిని స్మరించండి, అభీష్టం నెరవేరుతుంది.

మకరం:

సర్వోత్తమ కాలమిది. కార్యసిద్ధి ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించండి. అధికార లాభం సూచితం. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసలు ఉంటాయి. సుఖసంతోషాలున్నాయి. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. కాదనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. దుర్గాదేవిని స్మరించండి, మంచి జరుగుతుంది.

కుంభం:

కాలం చాలా వ్యతిరేకంగా ఉంది. శ్రద్ధగా వ్యవహరించండి. అపార్థాలకు తావుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. శ్రమ పెరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బందిపెడతాయి. దృఢసంకల్పంతో ధర్మమార్గంలో బాధ్యతలను నిర్వర్తించండి. వారాంతంలో ఊరట లభిస్తుంది. నవగ్రహాలను స్మరించండి, అభీష్టసిద్ధి ఉంటుంది.

మీనం:

అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఉత్సాహంతో పని మొదలుపెట్టండి. కోరుకున్న ఫలితాలకు తగినట్లుగా కార్యాచరణ ఉండాలి. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఆశయం నెరవేరుతుంది. ఇష్టదేవతను దర్శించండి, శాంతి లభిస్తుంది.

ఇదీ చూడండి: బాలికపై ఆలయ పూజారి అత్యాచారం- జాతకం కోసం వెళ్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.