Weekly Horoscope: అక్టోబర్ 2 నుంచి 8 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. చక్కటి ఆలోచనావిధానంతో అనుకున్న పనుల్ని పూర్తిచేస్తారు. వ్యాపారబలం అద్భుతం. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఇంట్లోవారి సూచనలు అవసరం. మిత్రుల వల్ల ఒక విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతృప్తినిచ్చే వార్త వింటారు. దుర్గాదేవిని ధ్యానిస్తే మంచిది.
ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. స్వయంకృషితో పైకి వస్తారు. ఇతరులపై ఆధారపడవద్దు. వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి సూచితం. ధనలాభం ఉంది. ఆనందంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల అభినందనలు ఉంటాయి. దేనికీ వెనకాడవద్దు. సమష్టి కృషితో సంకల్పం సిద్ధిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధనతో మానసిక శక్తి లభిస్తుంది.
మంచి కాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనోబలం విశేషంగా ఉంటుంది. అధికారయోగం సూచితం. వ్యాపారంలో కలిసొస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ధనలాభాన్ని ఇస్తుంది. స్థిరబుద్ధితో ప్రశాంతంగా ఆలోచించండి. ఒత్తిడి ఉంటుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, శక్తి పెరుగుతుంది.
తిరుగులేని శుభకాలం. ఇప్పుడు చేసే పని మంచి ఫలితాన్నిస్తుంది. మనసు పెట్టి పనిచేయండి. ఉద్యోగంలో బాగుంటుంది. అధికార యోగం ఉంటుంది. గొప్ప కీర్తిని పొందుతారు. అభీష్ట సిద్ధి లభిస్తుంది. గృహ భూ వాహనాది యోగాలకు అనుకూలమైన కాలం. సుఖసంతోషాలు ఉంటాయి. అద్భుతమైన వ్యాపార లాభముంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
వ్యాపారయోగం బ్రహ్మాండం. విశేష ధనలాభం సూచితం. తగు మానవ ప్రయత్నం చేయాలి. ఎవరి మాటలూ పట్టించుకోవద్దు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. సూర్య నమస్కారం చేయండి, శుభవార్త వింటారు.
మంచి ఆలోచనలతో పని ప్రారంభించండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా పనులు సమర్థంగా పూర్తిచేస్తారు. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. విఘ్నాలున్నాయి. అడుగడుగునా అడ్డు తగిలేవారుంటారు. ఆలోచించి అడుగేయాలి. వ్యాపారంలో లాభముంటుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మనశ్శాంతి ఉంటుంది.
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. పొరపాటు జరక్కుండా ప్రతిపనీ ఆలోచించి చేయాలి. నిరాశ పరిచే పరిస్థితులు ఉంటాయి. ధైర్యంగా పనిచేయండి. చెడు ఆలోచనలు రానివ్వవద్దు. ఒంటరిగా ఏ ప్రయత్నమూ చేయవద్దు. ఇంట్లోవారి సలహా తప్పనిసరి. స్నేహితులతో సౌమ్యంగా వ్యవహరించండి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.
ఉత్తమ కాలమిది. శుభఫలితం సొంతమవుతుంది. అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. మంచి పనులు చేసి విశేష లాభాలు అందుకోవాలి. గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పేరు సంపాదించుకోవాలి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.
ప్రయత్నం సఫలమవుతుంది. ఆశయం నెరవేరుతుంది. అద్భుతమైన శుభయోగం ఉంది. అన్నిట్లోనూ కలసివస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి సూచితం. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆలోచనలు మంచి మార్గంలో నడిపిస్తాయి. సమష్టి నిర్ణయాలు మంచి భవిష్యత్తును ఇస్తాయి. వ్యాపారరీత్యా శ్రమ ఉంటుంది. ఇష్టదైవారాధన మంచిది.
విశేషమైన కృషితో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. అధికారులతో సౌమ్యంగా సంభాషించండి. పొరపాటు జరగనివ్వద్దు. వారం మధ్యలో విజయం లభిస్తుంది. ఆవేశపరిచే వారుంటారు. ధైర్యం కోల్పోవద్దు. సమష్టి కృషితో లాభం ఉంటుంది. శుభవార్త శక్తినిస్తుంది. నవగ్రహ శ్లోకం చదవండి, దైవానుగ్రహం లభిస్తుంది.
అద్భుతమైన శుభయోగం ఉంది. తగిన ప్రయత్నం చేయండి. అనుకున్న స్థితికి చేరతారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. ఉత్తమకాలం నడుస్తోంది, సద్వినియోగం చేసుకోవాలి. ఆపదలు తొలగుతాయి. వారం మధ్యలో ముఖ్యమైన పని పూర్తవుతుంది. మిత్రబలం మేలు చేస్తుంది. సూర్యదేవుడిని స్మరించండి, శుభం జరుగుతుంది.
ఏకాగ్రతతో పని ప్రారంభించండి, మంచి ఫలితాలు వస్తాయి. అంతా మన మంచికేనన్నట్లుగా ఆలోచించాలి. తొందరవద్దు. విఘ్నాలను తెలివిగా అధిగమించాలి. ఎవరితోనూ తర్కించవద్దు. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. నమ్మకం గెలిపిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ఆదిత్యహృదయం పఠించండి, మేలు జరుగుతుంది.