ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారపరంగా శ్రద్ధ అవసరం. కొందరివల్ల విఘ్నాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. పెద్దలను ప్రతిభతో మెప్పించాలి. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది.

మంచి ఆలోచనావిధానంతో లక్ష్యం సిద్ధిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో స్వల్ప సమస్య ఉంటుంది. చాకచక్యంగా పరిష్కరించాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. అకారణ కలహాలకు అవకాశముంది. అపార్థాలకు
తావివ్వవద్దు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. దుర్గాదేవిని దర్శిస్తే మేలు.

ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. అభివృద్ధి సూచితం. ఉత్సాహంతో పనుల్ని పూర్తి చేయండి. మనోభీష్టం వెంటనే నెరవేరుతుంది. ఆవేశపరిచేవారున్నారు. శాంతంగా వ్యవహరించాలి. అవసరాలకు ధనం లభిస్తుంది. వారం మధ్యలో కార్యసిద్ధి ఉంటుంది. పెద్దలు చెప్పిన మార్గంలో నడిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విష్ణుమూర్తిని స్మరించండి. మనసుకు శాంతి చేకూరుతుంది.

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యం చేరువలోనే ఉంది. ప్రణాళికతో పనులు పూర్తిచేయండి. మోసం చేసేవారున్నారు. దగ్గరివారితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికాంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారమూ అనుకూలమే. త్వరలో మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. ఇష్టదైవస్మరణతో శాంతి లభిస్తుంది.

శుభకాలం నడుస్తోంది. పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగఫలాలు శుభప్రదం, వ్యాపారరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మానవ ప్రయత్నం అవసరం. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. భూ, గృహ- వాహనాది యోగాలు సఫలమవుతాయి. లక్ష్మీధ్యానం శక్తినిస్తుంది.

అదృష్టయోగం మొదలైంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితముంటుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. భారీ లక్ష్యాలతో పనులకు శ్రీకారం చుట్టండి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఇష్టదేవతాస్మరణతో కలిసివస్తుంది.

మనోబలంతో విజయం లభిస్తుంది. ధర్మమార్గంలో పయనించండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. సంకల్పం బలంగా ఉండాలి. పూర్వ పుణ్యం ఆపదల నుంచి రక్షిస్తుంది. ఒత్తిడికి గురిచేసే పరిస్థితులున్నాయి.
సమష్టిగా పోరాడాలి. కుటుంబసభ్యులతో సఖ్యతగా వ్యవహరించాలి. సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు.

బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందండి. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. ఆర్థికాంశాలు బాగున్నాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంటుంది. నూతన నిర్ణయాల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. విశ్వాసం గెలిపిస్తుంది. శివస్మరణ మంచిది.

ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. మానసికంగా విఘ్నాలు ఎదురవుతాయి. ముఖ్యవ్యక్తుల సూచనలు అవసరం. వివాదాలకూ గందరగోళ పరిస్థితులకూ దూరంగా ఉండాలి. సంకల్పం దృఢంగా ఉండాలి. అభీష్టం త్వరలోనే నెరవేరుతుంది. శివారాధన కార్యసిద్ధినిస్తుంది.

బ్రహ్మాండమైన విజయం ఉంది. మనసుపెట్టి గట్టి ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితముంది. వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది. అనేక మార్గాల్లో విజయం సాధిస్తారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది.

మనోబలంతో పనులు ప్రారంభించండి. ఫలితం వెంటనే కనిపిస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ పెరిగినా గౌరవం లభిస్తుంది. వ్యాపారరీత్యా జాగ్రత్త అవసరం. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ధర్మం రక్షిస్తుంది. సకాలంలో పనులు పూర్తిచేయండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. శ్రీవిష్ణుస్మరణ ఆనందాన్నిస్తుంది.

యశోవృద్ధి లభిస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. లక్ష్మీకటాక్షసిద్ధి విశేషంగా ఉంటుంది. సత్ఫలితాలను సాధిస్తారు. దగ్గరివారితో ప్రేమగా వ్యవహరించాలి. సరైన ప్రణాళికతో కష్టపడితే తిరుగులేని జీవితం లభిస్తుంది. సంకల్ప బలాన్ని బట్టి ఉత్తమ ఫలాలు లభిస్తాయి. ఇంట్లోవారికి మీవల్ల మేలు జరుగుతుంది. నృసింహస్వామిస్మరణ శుభప్రదం.