ETV Bharat / bharat

ఆ రాశి వారికి జాబ్ ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాలు పక్కా- కానీ! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 10th December To 16th December 2023 : ఈ డిసెంబర్​ 10 నుంచి డిసెంబర్​​ 16 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 10th december to 16th December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 4:52 AM IST

Weekly Horoscope From 10th December To 16th December 2023 : ఈ డిసెంబర్​ 10 నుంచి డిసెంబర్​ 16 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : ఈ వారం మేష రాశివారికి చాలా బాగుంటుంది. వివాహితులు సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమికులకు మాత్రం పరీక్షా కాలం. మేష రాశివారు ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ప్రభుత్వ రంగం నుంచి కూడా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. అయితే పనిమీద దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మేష రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం ప్రారంభంలోనూ, వారంలోని చివరి మూడు రోజులు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.

.

వృషభం (Taurus) : ఈ వారం వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వైవాహిక జీవితం ఒడుదొడుకులు ఏర్పడవచ్చు. అయితే ప్రేమికులకు మాత్రం ఈ వారం కలిసి వస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ మీ ఖర్చులు అమాంతం పెరుగుతాయి. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వారంలో చివరి రోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

.

మిథునం (Gemini) : ఈ వారం మిథున రాశివారికి చాలా బాగుంటుంది. ప్రేమికులు శృంగార రసానుభూతిని ఆస్వాదిస్తారు. వివాహితులు జీవిత భాగస్వామితో ప్రేమపూర్వకంగా ఉంటారు. మీలోని కళను, సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. ఉద్యోగులకు ఈ వారం బాగుంటుంది. ఈ వారం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది. దీని వల్ల మంచి ఆదాయం చేకూరుతుంది. విద్యార్థులు మాత్రం చదువుపై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సిందే. వారంలో మొదటి రోజు మాత్రమే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో కొద్దిపాటి ఆందోళనలు చెలరేగవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది. ప్రేమికులకు మాత్రం ఈ వారం ఏమీ బాగుండదు. కర్కాటక రాశివారు చేపట్టే పనులు ఈ వారం సఫలం అవుతాయి. ప్రత్యర్థులపై విజయం కూడా సాధిస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. అయితే కష్టపడితేనే మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

.

సింహం (Leo) : ఈ వారం సింహ రాశివారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రేమికులు ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం పెరుగుతుంది. స్నేహితులు మీకు సహకారం అందిస్తారు. ఈ వారం మీరు గృహ నిర్మాణ పనులు చేపట్టడం మంచిది. ప్రభుత్వ నుంచి ప్రయోజనం కూడా పొందవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులకు కొంత వ్యతిరేకత ఏర్పడవచ్చు. కొన్ని కీలక విషయాల్లో నష్టాలు కూడా రావచ్చు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. అయితే సింహ రాశివారి ఆరోగ్యం ఈ వారం బాగానే ఉంటుంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలం.

.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశివారికి బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే ప్రియమైన వారికి ఎక్కువ సమయం కేటాయించలేక ఇబ్బంది పడతారు. అయితే మీ అత్తమామల మద్ధతు మీకు లభిస్తుంది. ఈ వారం మీరు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగులకు ఈ వారం బాగుంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ వారమంతా ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

.

తుల (Libra) : ఈ వారం తుల రాశివారి ప్రేమ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో కలిసి శృంగార రసానుభూతిని ఆస్వాదిస్తారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ వారం మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఈ వారం విలాసాలకు కూడా బాగా ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కానీ ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి.

.

వృశ్చికం (Scorpio) : ఈ వారం వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. వివాహితుల గృహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు ఒక్కటవుతారు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే ఖర్చులు వేగంగా పెరగవచ్చు. కానీ వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. గతంలో మీరు ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మాత్రం సోమరితనం వదలాల్సిందే. వారం మధ్యలో, వారం చివరి రోజుల్లో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనుస్సు రాశి ప్రేమ విషయాలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. ప్రేమికులు ఒకటయ్యే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులు తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ వారం ధనుస్సు రాశివారు తమలోని సృజనాత్మకతను, కళాత్మకతను వెలికి తీస్తారు. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపును, అవార్డులను కూడా పొందవచ్చు. అయితే స్వల్పంగా ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వారం ప్రారంభంలో, వారం చివరి రోజుల్లో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

.

మకరం (Capricorn) : ఈ వారం మకర రాశివారి వైవాహిక జీవితంగా కాస్త అసంతృప్తి ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఘర్షణలు ఏర్పడవచ్చు. అయితే పని ప్రదేశంలో సరదాగా గడిచిపోతుంది. మీలోని వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులు మాత్రం తమ ఉద్యోగుల కోర్కెలను తీర్చాల్సి వస్తుంది. విద్యార్థులు పరధ్యానాన్ని విడనాడాలి. కచ్చితంగా చదువుపై దృష్టి సారించాలి. ఈ వారం మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వారంలో మొదటి రెండు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

.

కుంభం (Aquarius) : ఈ వారం కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో గొడవలు పడకుండా జాగ్రత్త పడాలి. ప్రేమికులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వారం మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా మీరు చేసిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. ఇది మీపై ఉన్న ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. మీ శ్రమ సఫలీకృతం అవుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వారంలోని మొదటి మూడు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

.

మీనం (Pisces) : ఈ వారం మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ పిల్లల భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేస్తారు. అయితే వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు చాలా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ దీని వల్ల మంచి ఆర్థిక లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వారం మధ్యలో ప్రయాణాలు చేస్తే, అనుకూల ఫలితాలు లభిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.