ఈ వారం (ఆగస్టు22 - 28) రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఏకాగ్రతతో పనులు చేయండి. త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం లభిస్తుంది. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి. దగ్గరివారితో విభేదాలు రానివ్వవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలం. వారం మధ్యలో ఒక సమస్య ఉంటుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మేలు.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపారం అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. తొందరవద్దు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఎదురుచూస్తున్న పనుల్లో కొంత లాభముంటుంది. ఓర్పు, తగినంత విశ్రాంతి అవసరం. శివారాధన ఉత్తమం.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు త్వరగా లాభాన్నిస్తాయి. అభీష్టసిద్ధి విశేషంగా ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. శ్రేష్ఠమైన భవిష్యత్తు సొంతమవుతుంది. ధనధాన్య ప్రాప్తి, గృహ వాహనాది యోగాలు అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు గోచరిస్తాయి. ఇష్టదేవతాస్మరణ ఉత్సాహాన్నిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
ఉత్తమ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. వ్యాపారబలం అద్భుతం. ఏకాగ్ర చిత్తంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం సడలనివ్వవద్దు. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. వారం మధ్యలో ఒక పనిలో విజయముంటుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఆదిత్యహృదయం చదివితే మేలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
అనేక శుభయోగాలున్నాయి. కాలాన్ని స్వకార్యాలకై వినియోగించుకోవాలి. శ్రేష్ఠమైన ఫలితాలు సాధించే కాలమిది. భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి లభిస్తుంది. వస్తు లాభముంటుంది. వారాంతంలో మేలు జరుగుతుంది. మీవల్ల కొందరికి కలిసి వస్తుంది. ఇష్టదేవతారాధన ఉత్తమం.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. అంతా మంచే జరుగుతుంది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కాలం అనుకూలిస్తుంది. చక్కని విజయం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పని చేయండి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పదవీ లాభముంది. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి వస్తుంది. మీవల్ల కొందరు లాభపడతారు. అధికారుల ప్రశంసలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారం లాభదాయకం. ఇష్ట దేవతను ధ్యానించండి, శుభవార్త వింటారు.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
చక్కని శుభయోగముంటుంది. ప్రయత్నబలాన్నిబట్టి విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితముంటుంది. అదృష్టప్రాప్తి ఉంది. ధనయోగం విశేషంగా ఉంది. పెద్దలనుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వారాంతంలో పని జరుగుతుంది. ఇష్టదేవతాదర్శనం మనశ్శాంతినిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడివల్ల విఘ్నాలు అధికమవుతాయి. పట్టుదలతో లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. ప్రశాంతచిత్తంతో వ్యవహరించాలి. ఖర్చులు పెరుగుతాయి. కలహాలకు, అపార్థాలకు తావివ్వవద్దు. నవగ్రహస్తుతి మేలు చేస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
మనోబలంతో ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపకుండా పూర్తిచేయండి. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగరీత్యా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా లాభముంటుంది. క్రమశిక్షణతో పనిచేస్తే ఆశయం నెరవేరుతుంది. శివస్మరణ శుభప్రదం.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
శుభ ఫలితం ఉంటుంది. మనసుపెట్టి పనిచేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అవరోధాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. వ్యాపారపరంగా ఒత్తిడిని జయించాలి. స్పష్టమైన సంభాషణతో అపార్థాలు తొలగుతాయి. మంచి మైత్రి నెలకొంటుంది. ముఖ్యకార్యాలను విఘ్నాలు లేకుండా పూర్తిచేయాలి. వారాంతంలో కోరుకున్న ఫలితం వస్తుంది. శివస్మరణ మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
శ్రేయస్సునిచ్చే ఫలితాలున్నాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తారు. వాటిని ఉపయోగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా శుభప్రదమైన కాలమిది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. శ్రమ ఫలిస్తుంది. ఎదురుచూస్తున్న ఫలితం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.