Weekly Horoscope: ఈ వారం (డిసెంబర్ 12 - డిసెంబర్ 18) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. శ్రమ అధికమైనా ఫలితం బాగుంటుంది. చేపట్టిన పనులకు తోటివారి సహకారం అందుతుంది. ధర్మమార్గంలో చేసే ప్రయత్నం సత్వర విజయాన్నిస్తుంది. దైవబలం రక్షిస్తోంది. సమస్యల నుంచి బయటపడతారు. దేనికీ కుంగిపోవద్దు. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
మనోబలంతో విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది, ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఒత్తిడిని తట్టుకుంటూ జాగ్రత్తగా పనులను పూర్తి చేయాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. మానసిక దృఢత్వం అవసరం. సహాయం చేసేవారుఉన్నారు. ఒకమెట్టు దిగైనా సరే పని చేసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఉత్తమకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. గత వైభవం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగరీత్యా ఎదుగుదలకు అవకాశముంది. సుఖసంతోషాలుంటాయి. శత్రుదోషం తగ్గుతుంది. వ్యాపారంలో కలిసివస్తుంది. నూతన వస్తు వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, సర్దుకుపోయే ధోరణి అవసరం. వ్యాపారం బాగుంటుంది. కొందరి వల్ల కలిసివస్తుంది. ఆశయసాధనలో శ్రమ పెరుగుతుంది. అంతఃకరణ శుద్ధితో సరైన నిర్ణయం తీసుకోండి. అది ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. సూర్యనమస్కారం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది, ఉన్నత పదవీలాభం సూచితం. మనసులోని కోరిక తీరుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తే కార్యసిద్ధి సొంతమవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆంజనేయస్వామిని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
మంచి సమయమిది. ఇప్పుడు చేసే పనులు బ్రహ్మాండమైన విజయాన్ని ఇస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమిస్తారు. వాహన సౌఖ్యముంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శ్రేయోదాయకం.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
చక్కని విజయం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితముంది.చిత్తశుద్ధితో పని ప్రారంభించండి. కుటుంబ పరిస్థితులు సానుకూలం. ముందుచూపు బంగారు భవిష్యత్తునిస్తుంది. వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల సహకారాన్ని తీసుకోండి. న్యాయపరంగా విజయం ఉంటుంది. శివస్మరణ శ్రేష్ఠం.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార లాభం సూచితం. మొహమాట పడితే వృథా శ్రమ మిగులుతుంది. శత్రుదోషం కొంత వెంటాడుతోంది. ధర్మచింతనతో పనులు పూర్తి చేయండి. వారం మధ్యలో విజయముంటుంది. అపోహలు తొలగి, బాంధవ్యాలు బలపడతాయి. అంతా శుభమే గోచరిస్తోంది. సూర్యధ్యానం శుభప్రదం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందర పనికిరాదు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. తోటివారితో సఖ్యతగా మెలగాలి. వ్యాపారరీత్యా శుభప్రదం. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలతో ఆనందిస్తారు. సాహసకార్యాలు ఫలిస్తాయి. ఇంట్లోవారి మాట వినాలి. ఇష్టదేవతను తలచుకోండి, మేలు జరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
అదృష్టయోగముంది. అభీష్టసిద్ధి విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. మంచివార్త వింటారు. గృహలాభం సూచితం, ఆస్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసివస్తాయి. ఇష్టదేవతను ప్రార్థించండి, శాంతి లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఉద్యోగ యోగం అనుకూలం. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంది. ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం చేయండి, కలిసివస్తుంది. ముఖ్యకార్యాల్లో సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరగనివ్వకండి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఆశయసాధనలో పురోగతి ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇష్టదైవారాధన మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మనోబలం విజయాన్నిస్తుంది. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. సౌమ్య సంభాషణతో మిత్రత్వం పెరుగుతుంది. వ్యాపారలాభం ఉంటుంది. అభీష్టసిద్ధి కలుగుతుంది.సమస్యలు తొలగిపోతాయి. ఆనందదాయకమైన జీవితం లభిస్తుంది. ఉన్నతాశయాలతో ముందుకు సాగండి. ఆదిత్యహృదయం చదవండి, సుఖం లభిస్తుంది.