ETV Bharat / bharat

బంగాల్​ భాజపా ఎంపీపై ఈసీ ఆంక్షలు

బంగాల్​ భాజపా నేత రాహుల్​ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా 48 గంటలపాటు నిషేధం విధించింది.

author img

By

Published : Apr 13, 2021, 12:52 PM IST

Updated : Apr 13, 2021, 1:28 PM IST

C bars BJP leader Rahul Sinha from campaigning for 48 hours
బంగాల్​లో భాజపా నేతపై ఈసీ నిషేధం

బంగాల్​లో భాజపా నేత రాహుల్​ సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా 48 గంటలపాటు నిషేధం విధించింది. కూచ్​ బిహార్​, సీతల్​కుచిలో జరిగిన కాల్పుల్లో "కేంద్ర బలగాలు నలుగురిని కాదు.. ఎనిమిది మందిని కాల్చివేసి ఉండాల్సింది" అంటూ రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు నిషేధం అమల్లో ఉండనుంది.

సీతల్​ కుచి ఘటనపై వ్యాఖ్యలు చేసిన.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ను సైతం ఈసీ ప్రశ్నించింది. ఆ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం 10 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: గ్రామాల బాట పట్టిస్తున్న 'లాక్​డౌన్​ భయం'

Last Updated : Apr 13, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.