ETV Bharat / bharat

మృతదేహం వేలిముద్రతో బాండ్​పేపర్​పై సంతకం.. - dead body thumb impression news in karnataka

ఆస్తి కోసం ఓ కుటుంబం మానవత్వం మరిచింది. చనిపోయిన కుటుంబ సభ్యురాలి నుంచి ఖాళీ బాండ్​పేపర్​పై వేలిముద్రలు తీసుకున్నారు బంధువులు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని మైసూర్​లో జరిగింది.

mysore dead body thumb impression news
మృతదేహం వేలుముద్రలు
author img

By

Published : Nov 28, 2021, 8:24 PM IST

Updated : Nov 29, 2021, 12:08 AM IST

మృతదేహం వేలిముద్రతో బాండ్​పేపర్​పై సంతకం

కర్ణాటక మైసూర్ జిల్లాలోని శ్రీరామ్​పుర్ ప్రాంతంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం వేలిముద్రలను ఓ ఖాళీ బాండ్​పేపర్​పై సంతకం తీసుకున్నారు కుటుంబసభ్యులు.

జయమ్మ(63) వృద్ధాప్య సమస్యలతో మరణించింది. అయితే.. జయమ్మ తన నాన్న వైపు నుంచి 14 ఎకరాల భూమిని ఆస్తిగా పొందింది. పెళ్లైననాటి నుంచి భర్తకు దూరంగా.. పుట్టింటిలోనే ఉండిపోయింది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు పిల్లలు లేరు. ఇద్దరు అక్కాచెళ్లిల్లు, ఓ తమ్ముడు ఉన్నారు.

జయమ్మ మరణంతో ఆ ఆస్తి ఎవరికి చెందాలనే అంశంపై బంధువుల్లో వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో జయమ్మ అక్క కొడుకు ఆమె మృతదేహం నుంచి ఖాళీ బాండ్​పేపర్​పై వేలిముద్రలు తీసుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:'కొవిడ్​ సర్టిఫికేట్ల' కోసం భారీ క్యూ.. రూ.50వేలు వస్తాయని...

చెల్లెలిపై మూడు నెలలుగా అన్న అత్యాచారం.. చివరకు..

Last Updated : Nov 29, 2021, 12:08 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.