రాజస్థాన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్గఢ్లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో కర్షకులకు మద్దతుగా కాసేపు ట్రాక్టర్ నడిపారు.
శనివారం ఉదయం అజ్మేర్ చేరుకున్న రాహుల్.. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తదితర నేతలతో సుర్సురా గ్రామంలోని వీర్ తేజాజీ ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
నిరుద్యోగం..
అజ్మేర్లో జరిగిన సభలో రాహుల్ వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పించారు. చట్టాల కారణంగా నిరుద్యోగం మరింత పెరుగుతుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా దేశంలో ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయం భరతమాతకు చెందినదని, పారిశ్రామికవేత్తలకు కాదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : అజిత్ డోభాల్కు భద్రత పెంపు