ETV Bharat / bharat

ఎమోషనల్​ వీడియోతో తండ్రికి హార్దిక్​ నివాళి

ఆల్​ రౌండర్​ హార్దిక్​ పాండ్య తన తండ్రికి ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు. తండ్రితో ఉన్న మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను పంచుకున్నారు. గుండెపోటు కారణంగా గతవారం హార్దిక్​ తండ్రి కన్నుమూశారు.

Watch: Hardik Pandya pays tribute to late father with an emotional video
తండ్రికి నివాళిలర్పిస్తు భావోద్వేగానికి లోనైన హార్దిక్​ పాండ్య
author img

By

Published : Jan 23, 2021, 7:00 PM IST

Updated : Jan 23, 2021, 7:18 PM IST

భారత క్రికెటర్​ హార్దిక్​ పాండ్య.. ట్విట్టర్​ వేదికగా తన తండ్రికి నివాళి అర్పించాడు. గత వారం గుండెపోటు కారణంగా మరణించిన తండ్రి హిమాన్షు పాండ్యను గుర్తుచేసుకుని.. తన హృదయంలోని బాధనంతా వెలిబుచ్చుతూ ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశాడు.

చిన్ననాటి నుంచి తండ్రితో హార్దిక్​ పెనవేసుకున్న అనుభూతులతో ఈ వీడియో ఉంది. 'టు డాడ్​' అనే క్యాప్షన్​తో ఉన్న ఈ వీడియోలో.. భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రికెటర్​ని ఈ దేశానికి ఇచ్చారంటూ.. హార్దిక్​ తండ్రికి అమితాబ్​ బచ్చన్​ అభినందనలు తెలిపిన క్లిప్ కూడా​ ఉంది. ఈ వీడియోకు ప్రముఖ హిందీ సినిమాలోని 'అప్నే తు అప్నే హోతే హైన్'​ పాట బ్యాగ్రౌండ్​లో వస్తూ హార్దిక్​ హృదయంలోని బాధను తెలియజేస్తోంది.

త్వరలో జరగబోయే ఇంగ్లాండ్​ టెస్ట్​ సిరీస్​కు హార్దిక్​ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల ఆరంభంలోనే ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. ఇంగ్లాడ్​లో ఆడబోయే టెస్ట్​ సిరీస్​కు జట్టులో హార్దిక్​ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్‌ చెప్పలేదు..

Last Updated : Jan 23, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.