తన జీవితంలో ఎన్నడూ అవినీతితో రాజీ పడలేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik News) తెలిపారు. కొత్తగా నియమితులైన అధికారులతో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన (Satyapal Malik News) పలు విషయాలను వెల్లడించారు. జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పారన్నారు నవాబ్ మాలిక్.
"దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థల దస్త్రాలివి. ఒత్తిళ్లకు భయపడదలచుకోలేదు వాటిని తిరస్కరించాను. ఈ అవినీతి వ్యవహారాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నా నిర్ణయాన్ని సమర్ధించారు. అవసరమైతే పదవిని వీడేందుకు ఆ సమయంలో సిద్ధపడ్డాను" అని మాలిక్ వెల్లడించారు. మాలిక్ ప్రసంగ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Satyapal Malik News) చక్కర్లు కొడుతోంది.
ఇదీ చూడండి : కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. బైక్ల స్వాధీనం