ETV Bharat / bharat

Warangal, Telangana Election Result 2023 Live : ఉమ్మడి వరంగల్​లో కాంగ్రెస్ పార్టీ హవా - 10 చోట్ల గెలుపు - తెలంగాణ ఎన్నికలు

Warangal, Telangana Election Result 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సంకేతం ఎగురవేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, రెండు చోట్ల బీఆర్​ఎస్ గెలిచింది.

Warangal
Warangal, Telangana Election Result 2023 Live
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 5:54 PM IST

Updated : Dec 3, 2023, 10:47 PM IST

Warangal, Telangana Election Result 2023 Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం రెండు సీట్లలో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది.

Congress Wins Nine Seats in Warangal District : ములుగు నుంచి సీతక్క(కాంగ్రెస్) గెలవగా, మహబూబాబాద్ నియోజకవర్గంలో మురళీ నాయక్(కాంగ్రెస్), నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్), వర్ధన్నపేటలో నాగరాజు(కాంగ్రెస్) గెలుపొందారు. పాలకుర్తిలో యశస్విని(కాంగ్రెస్) విజయం సాధించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్​రావు ఓటమి పాలయ్యారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కాంగ్రెస్​ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు గెలుచుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేఆర్​ నాగార్జున(కాంగ్రెస్) గెలిచారు.

జనగాం నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి(బీఆర్ఎస్) సమీప అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్​రెడ్డిని ఓడించారు. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి(బీఆర్ఎస్) విజయం సాధించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వివరాలు :​

  • భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు గెలుపొందారు.
  • డోర్నకల్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జె.రామచంద్ర నాయక్ విజయం సాధించారు.
  • మహబూబాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ భూక్య విజయం సాధించారు.
  • ములుగు : ములుగు నియోజకవర్గంలో డీ. అనసూయ సీతక్క విజయం సాధించారు.
  • నర్సంపేట : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహదేవ రెడ్డి విజయం సాధించారు.
  • పరకాల : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి గెలుపొందారు.
  • వర్ధన్నపేట : ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగార్జున విజయం సాధించారు.
  • వరంగల్ తూర్పు : కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఈ ఎన్నికలో గెలుపొందారు.
  • వరంగల్ పడమర : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు.
  • జనగాం : ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
  • పాలకుర్తి : కాంగ్రెస్​ అభ్యర్థి మామిడాల యశస్విని విజయం సాధించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్​రావును ఓడించారు.
  • స్టేషన్ ఘన్​పూర్ : కడియం శ్రీహరి

Last Updated : Dec 3, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.