ETV Bharat / bharat

'ఆ టీకాలతో మరణం నుంచి 98 శాతం రక్షణ' - vk paul

రెండు డోసుల టీకాతో రోగ తీవ్రత, మరణభయం తగ్గిపోతుందని నీతి ఆయోగ్​ సభ్యుడు వీకేపాల్​ తెలిపారు. చండీగఢ్​లోని 'పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్​ ఎడ్యుకేషన్​, రీసెర్చ్​' పంజాబ్​ పోలీసులపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలిందని పేర్కొన్నారు.

two dose vaccine
రెండు డోసుల టీకా సామర్థ్యం
author img

By

Published : Jul 3, 2021, 8:06 AM IST

Updated : Jul 3, 2021, 8:35 AM IST

దేశంలో అందిస్తున్న రెండు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్, కొవిషీల్డ్​) ప్రజలను రోగ తీవ్రత, మరణం నుంచి మంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని నీతి ఆయోగ్​ సభ్యుడు వీకేపాల్​ వెల్లడించారు. ఈ మేరకు చండీగఢ్​లోని 'పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్​ ఎడ్యుకేషన్​, రీసెర్చ్​' పంజాబ్​ పోలీసులపై జరిపిన అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోసు తీసుకున్న వారికి 92 శాతం, రెండు డోసులు తీసుకున్నవారికి 98 శాతం మరణం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడించారు.

పంజాబ్​ పోలీసుల్లో 'టీకా తీసుకోనివారు, ఒక డోసు తీసుకున్నవారు, రెండు డోసులు తీసుకున్నవారు' అనే మూడు గ్రూపులుగా చేసి ఈ అధ్యయనం జరిపారు. "పంజాబ్​ పోలీసుల్లో వ్యాక్సిన్​ తీసుకోని వారు 4,868 మంది ఉండగా అందులో కొవిడ్​ బారిన పడి 15 మంది మరణించారు. అదే ఒక్క డోసు తీసుకున్న 35,856 మందిలో 9 మంది కొవిడ్​తో మరణించారు. 42,720 మంది పోలీసులు రెండు డోసులు తీసుకోగా.. వారిలో ఇద్దరు మాత్రమే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ తీవ్రత, మరణభయం దాదాపు పూర్తిగా తగ్గిపోతున్నట్లు తేలింది. ఇదివరకు సీఎంసీ వెల్లూర్​లో నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే స్పష్టమైంది. మన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం" అని వీకే పాల్​ అన్నారు.

ఇవీ చదవండి:Coronavirus: సగానికిపైగా మరణాలు మే, జూన్​లోనే!

'కరోనా 2.0 కథ ముగియలేదు.. తేలికగా తీసుకుంటే...'

Last Updated : Jul 3, 2021, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.