Vizag Steel Plant Apprentice Recruitment 2023 : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2023 ఆగస్టు బ్యాచ్‌కు సంబంధించి 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
- పోస్టుల వివరాలు
Apprenticeship in Vizag steel plant :- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (GAT) - 200
- టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (TAT) - 50
విభాగాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (GAT) విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్
- టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (TAT) విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్
విద్యార్హతలు
Engineering jobs 2023 : 2021/2022/2023 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో కచ్చితంగా రిజిస్టర్ అయ్యుండాలి.
- ఫిజికల్ స్టాండర్డ్స్:
అభ్యర్థులు అప్రెంటీస్‌షిప్ రూల్ 1992, క్లాజ్ 4 ప్రకారం, ఫిజికల్ స్టాండర్డ్స్ (శారీరక ప్రమాణాలు) కలిగి ఉండాలి. - స్టైపెండ్ :
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9000, డిప్లొమా చేసిన అభ్యర్థులకు నెలకు రూ.8000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. - శిక్షణ కాలం:
Vizag steel plant Apprentice Training : ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
Vizag steel plant Engineer jobs selection process : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు. డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న అభ్యర్థులను ముందుగా వడపోస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, అందులో క్వాలిఫై అయిన వారిని అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (GAT), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (TAT) పోస్టులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
అధికారిక గూగుల్ ఫారమ్ లింక్ :
https://docs.google.com/forms/d/e/1FAIpQLScMtBlEBfNrYri2KnTbvmOAzO2loVNKboX_ciWIhOSVGJlI0w/viewform