కరోనా దృష్ట్యా సుప్రీంకోర్టు ఆవరణలో ప్రవేశించేవారు ఇకపై మరికొన్ని ముందు జాగ్రత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు పాలనాయంత్రాంగం అదనపు జాగ్రతలు సూచించింది.
- కరోనాకు సంబంధించి ఏ చిన్న లక్షణాలు (దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు సహా ఇతర లక్షణాలు) కనిపించినా తప్పనిసరిగా రాపిడ్/ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఉద్యోగులు, న్యాయవాదులు, వారి సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుంది. ఇలాంటి వారు సుప్రీం కోర్టుకు అసలు రాకూడదు. వెంటనే ఏకాంతంలో ఉండిపోవాలి.
- మాస్కులు ధరించడం, శానిటైజర్ రాసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు అమలయ్యేలా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం బాధ్యత తీసుకోవాలి.
- కోర్టు ఆవరణలో ఎక్కడా గుమిగూడకూడదు. పని ఉంటేనే రావాలి. లేకుంటే రాకూడదు. త్వరగా దానిని ముగించుకుని వెళ్లిపోవాలి.
- లిఫ్టులో ముగ్గురికి మించి వెళ్లకూడదు. దీనిని పైకి వెళ్లడానికి మాత్రమే వినియోగించాలి. కిందకి దిగినప్పుడు మెట్ల మార్గంలోనే రావాలి.
- ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలు సర్క్యులర్లలో చెప్పిన అంశాలు కూడా పాటించాలి.
ఇదీ చూడండి: 'కరోనా టీకాలు అందుబాటులో ఉంచుతాం!'