COP Gives CPR to Revive Snake Video Viral : మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు లేదా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేరే వ్యక్తులు నోటి ద్వారా శ్వాసను అందించి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. అలాగే.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న వారికి సీపీఆర్ చేసి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సీపీఆర్(CPR)ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది..? ఏవిధంగా అయితే మనిషి నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతామో.. అచ్చం అలాగే పాము నోట్లో నోరు పెట్టి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదూ..! కానీ మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి మాత్రం చనిపోయిందనుకున్న పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు పోశాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Snake CPR Video Viral : మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని సేమరి హరిచంద్ పోలీస్ పోస్ట్ పరిధిలో చోటుచేసుకున్నదీ ఘటన. అక్కడ స్థానికంగా ఉన్న రెసిడెన్షియల్ కాలనీలోని ఓ ఇంటి వద్దకు ఓ విషరహిత సర్పం వచ్చింది. వెంటనే దానిని చూసి భయపడిపోయిన స్థానికులు దానిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ పాము ఓ పైపులోకి దూరిపోయింది. దాంతో అక్కడివారు ఆ పామును చంపేందుకు పురుగుల మందును ఆ పైపులోకి పోశారు. ఆ మందు ప్రభావంతో పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఈ విషయం తెలుసుకున్న హరిచంద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి వచ్చాడు. ఆ పామును పరిశీలించి, దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లు పోసి శుభ్రం చేశాడు. ఆ తర్వాత సర్పాన్ని బతికించేందుకు సీపీఆర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో చాలా సార్లు పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా.. ఆపకుండా నోట్లోకి గాలి ఊదుతూ సీపీఆర్ చేశాడు. దాంతో కాసేపటికీ ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. అనంతరం దానిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
-
A Madhya Pradesh constable administered CPR to a snake that had lost consciousness due to pesticides.
— STELLA (@BrownKhaleesi) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Video: Local18. pic.twitter.com/pEHgM3PNHG
">A Madhya Pradesh constable administered CPR to a snake that had lost consciousness due to pesticides.
— STELLA (@BrownKhaleesi) October 26, 2023
Video: Local18. pic.twitter.com/pEHgM3PNHGA Madhya Pradesh constable administered CPR to a snake that had lost consciousness due to pesticides.
— STELLA (@BrownKhaleesi) October 26, 2023
Video: Local18. pic.twitter.com/pEHgM3PNHG
15 ఏళ్లలో 500 పాములను రక్షించిన కానిస్టేబుల్..
ఈ ఘటన అనంతరం మాట్లాడిన కానిస్టేబుల్ అతుల్ శర్మ.. పన్నెండో తరగతి నుంచే పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేవాడినని పేర్కొన్నాడు. గత 15 సంవత్సరాలలో తాను 500 పాముల వరకూ రక్షించినట్లు తెలిపాడు. ఎక్కువగా డిస్కవరీ ఛానల్‌ని చూసి.. ఇలాంటివి అనుసరిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే సర్పాలు కనిపిస్తే వాటిని చంపకుండా తనకు గానీ, స్నేక్ క్యాచర్లకు గానీ సమాచారం అందించాలని సూచించాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ధైర్యాన్ని మెచ్చకుంటూ కామెంట్ల రూపంలో అభినందనలు తెలుపుతున్నారు. ఈ పోలీస్ చేస్తున్న పనికి పలువురు నెటిజన్లు "సెల్యూట్ సార్" అని కూడా కొనియాడుతున్నారు.
'ఎలుకల మందు తిని పాముకు అస్వస్థత'.. బాటిల్‌తో నీళ్లు తాగిస్తే..
దాహంతో అల్లాడిన పాము.. నీళ్లు తాగించిన ఆఫీసర్.. లైవ్ వీడియో..