ETV Bharat / bharat

ఈ చిన్నోడు ఎంత 'ముద్దు'గా సారీ చెప్పాడో.. నెట్టింట వీడియో వైరల్​ - వైరల్​ వీడియో

అల్లరి చేసినందుకు అలిగిన టీచర్​ను బుజగిస్తూ.. ఆమెకు ముద్దులిస్తూ క్షమాపణలు చెప్పాడు ఓ చిన్నారి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Viral Video
Viral Video
author img

By

Published : Sep 13, 2022, 4:34 PM IST

అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేని ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 'ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్‌. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్‌' అంటూ ఉపాధ్యాయురాలు ఆ బాల విద్యార్థి తీరు పట్ల నొచ్చుకుంటారు. 'ఇకపై నీతో మాట్లాడబోను' అని కూడా ఆమె పేర్కొంటారు.

అయితే, దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్‌ను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్‌ సంతోషిస్తుంది. అయితే ముద్దుపెట్టుకోమని అడగటంతో ఆ టీచర్‌ రెండు చెంపలపైనా ఆ చిన్నోడు ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆదరిస్తుండటం వల్ల ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 3.32లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్‌ చేశారు. 'వీడియో ఎంతో ముద్దుగా ఉంది', 'మా పాఠశాల రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు' అంటూ నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  • ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN

    — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో చుక్కలు.. అంతా మస్క్ వల్లే..!

నర్సరీ స్టూడెంట్​పై దారుణం.. స్కూల్​ బస్సులో రేప్.. డ్రైవర్, మహిళా అటెండర్ కలిసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.