Viral Infection Vs Dengue : వాతావరణంలో మార్పుల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. దోమల విజృంభణ కారణంగా.. చాలామంది జనాలు డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతుంటారు. వైరల్ ఫీవర్లు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే విజృంభిస్తాయి. అయితే.. ఈ డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ మధ్య తేడాలేంటి..? వాటిని ఎలా గుర్తించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Infection : వైరల్ ఇన్ఫెక్షన్లు అంటే ఏమిటి..?
వైరల్ ఇన్ఫెక్షన్లు వైరస్‌ల వల్ల వ్యాప్తి చెందుతాయి. ఇవి ఎక్కువగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులను ఇతరులు వాడటం, వారు తాకిన వస్తువులను మరొకరు తాకడం ద్వారా.. వైరస్ వ్యాప్తి చెందుతుంది.
Viral Infection Symptoms : వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు :
- వైరల్ జ్వరం సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది.
- శ్వాసకోశంలో ఇబ్బంది, గొంతు నొప్పి, దగ్గు
- విపరీతంగా అలసిపోయినట్లుగా అనిపించడం
- కండరాల నొప్పులు, తలనొప్పి ఉంటాయి.
Dengue Fever Symptoms : డెంగ్యూ లక్షణాలు:
- ఇది చాలా రోజులపాటు ఉంటుంది.
- అకస్మాత్తుగా జ్వరం పెరగటం దీని ముఖ్య లక్షణం.
- తీవ్రమైన తలనొప్పి
- కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు
- జ్వరం ప్రారంభమైన కొన్ని రోజుల తరవాత శరీరంపై దద్దుర్లు రావడం
- జ్వరం తీవ్రమైన సందర్భాల్లో ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం
డెంగీ నుంచి కోలుకోవటానికి బెస్ట్ డైట్ ఇదే
వైరల్ ఇన్ఫెక్షన్లు - డెంగ్యూ మధ్య తేడాను ఎలా గుర్తించాలి?
సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ మధ్య తేడాను గుర్తించడం కష్టం. ఎందుకంటే.. ఈ రెండింటిలోను జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కంటే డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జలుబు, అలసట, గొంతునొప్పి, తేలికపాటి ఒళ్లు నొప్పులు ఉంటాయి. అదే డెంగ్యూ అయితే.. అధిక జ్వరం, తలనొప్పి, కీళ్లలో విపరీతమైన నొప్పులు ఉంటాయి. ఇంకా కొంతమందిలో శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు డెంగ్యూ సోకిన వ్యక్తికి 24 నుంచి 48 రోజుల మధ్యలో కనిపిస్తాయి.
తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ప్రమాదం:
డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే.. ప్లేట్‌లెట్ కౌంట్‌ను తనిఖీ చేయడం ద్వారా నిర్ధారించడం సులభం అవుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్‌కు రక్త పరీక్ష, డెంగ్యూ NS 1 యాంటిజెన్ పరీక్ష చేయాలి. డెంగ్యూ ఉన్నవారిలో 80 నుంచి 90 శాతం మందిలో ప్లేట్‌లెట్ కౌంట్ 1,00,000 కంటే తక్కువకు పడిపోతుంది. 10 నుంచి 20 శాతం మందిలో ప్లేట్‌కౌంట్ ప్రమాదకరం స్థాయిలో ఉంటుంది. ప్లేట్ కౌంట్ 20,000 కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన పరిస్థితిగా గుర్తించాలి.
How to Prevent Dengue Fever Telugu : మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం
Dengue Fever Symptoms : డెంగీ జ్వరం వచ్చిందా.. ఈ లక్షణాలున్నాయా.. ఏం చేయాలంటే..?