PM Narendra Modi: ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలో భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేయడమే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి కారణంగానే ఆ రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. సొంత రాష్ట్రమైన గుజరాత్లో మోదీ పర్యటించారు. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ మహాసమ్మేళనంలో పాల్గొన్న ఆయన పంచాయితీరాజ్ మూడంచెల వ్యవస్థలో ఉండే సుమారు లక్ష మంది ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామీణాభివృద్ధిని నెరవేర్చాల్సిన అవసరం మనపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సాధించి, సమగ్రాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇందుకుగానూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు.
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి మహానుభావులు పుట్టిన భూమి గుజరాత్. గ్రామాలు అభివృద్ధి చెందాలని గాంధీ కోరుకునే వారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నేడు మనం ఆయన కలను సాకారం చేద్దాం. గ్రామస్వరాజ్యాన్ని స్థాపించడంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన పాత్ర చాలా కీలకం. దీనికి అనుగుణంగా పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లందరూ కృషి చేస్తున్నారు.
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదీ చూడండి: 'మోదీజీ.. భ్రమలు వద్దు.. అసలు యుద్ధం 2024లోనే'