Vikram Kothari Kanpur: రోటోమాక్ గ్రూప్ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ కొఠారి ఇకలేరు. కాన్పుర్ తిలక్ నగర్‌లోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు.
Rotomac Bank Fraud: వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని.. సుమారు రూ. 3 వేలకోట్లకుపైనే ఎగ్గొట్టినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అనారోగ్యం కారణంగా.. కొఠారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజులు కాన్పుర్‌లోని తన ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. అనంతరం.. ఇంట్లోనే కాలు జారి కిందపడగా తలకు గాయమైంది. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్న కొఠారి.. ఇటీవలే ఇంటికి వచ్చారు.
అకస్మాత్తుగా మంగళవారం ఉదయం ఆయన నిద్రలేవలేదు. ఇంట్లో పనిచేసే సిబ్బంది వైద్యుడిని పిలిపించగా.. అప్పటికే కొఠారి చనిపోయినట్లు ప్రకటించారు. ఆ సమయంలో విక్రమ్ కొఠారి భార్య, కుమారుడు రాహుల్ కొఠారి వేరే పనిమీద లఖ్‌నవూ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: ముంబయిలో హైస్పీడ్ వాటర్ ట్యాక్సీలు- 7గంటల జర్నీ 15 నిమిషాల్లోనే!
రన్నింగ్ ట్రైన్ నుంచి పడిన చిన్నారి.. కాపాడబోయి తల్లి కూడా...