ETV Bharat / bharat

బీజేపీకి విజయశాంతి రాజీనామా - ఈ నెల 17న రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక! - బీజేపీ సీనియర్ నేత విజయశాంతి

Vijayashanti resigned from BJP
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 9:35 PM IST

Updated : Nov 15, 2023, 10:58 PM IST

21:30 November 15

బీజేపీకి విజయశాంతి రాజీనామా - ఈ నెల 17న రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక!

  • తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది, ఎప్పటికీ… pic.twitter.com/ASWAOc5Z9B

    — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Vijayashanti resigned from BJP : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్​ తగిలింది. ఇప్పటికే పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, ఏనుగు రవీందర్​రెడ్డి తదితరులు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి చేరనున్నారు. తాజాగా బీజేపీకి ఆమె రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా 'తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే. ఆ ప్రజల ప్రయోజనాలు, భద్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుంచి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంతమాత్రం సరికాదు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నది. అట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవం.

పార్టీల ప్రయోజనాలు వేరు.. ప్రజా ప్రయోజనాలు వేరు. ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి. అందుకే కోవిడ్ కష్టకాలంలో.. ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్‌లల్ల వస్తున్న ఆంధ్ర ప్రాంత వైద్య అవసర బాధితులు హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలియక పోలీసులు అడ్డుకున్న నాడు, వారిని తక్షణం వదలకుంటే ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని చెప్పినది రాములమ్మేనన్న జ్ఞాపకం ఇప్పటికీ అందరికీ సజీవమే.' అని విజయశాంతి ట్విటర్​ వేదికగా పోస్ట్ చేశారు.

కాంగ్రెస్​ గూటికి విజయశాంతి! - నేడో, రేపో చేరిక

Vijayashanthi fires on KCR : కాంగ్రెస్​ నేతల విలీనానికే.. కేసీఆర్​ వ్యూహం

Last Updated : Nov 15, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.