ETV Bharat / bharat

ఎంపీలకు 22 ప్రాంతీయ భాషల్లో ఉపరాష్ట్రపతి లేఖ - మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్​ సభ్యులందరికీ వారి వారి మాతృ భాషల్లో(22 ప్రాంతీయ భాషల్లో) లేఖలు రాశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అమ్మ భాషను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకు ప్రతి ఎంపీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Venkaiah Naidu
ఎంపీలకు 22 భారతీయ భాషల్లో ఉపరాష్ట్రపతి లేఖ
author img

By

Published : Feb 21, 2021, 5:12 AM IST

అమ్మభాష అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మన జీవితానికి ఆత్మ మాతృభాషేనని.. దాన్ని ప్రేమిస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఎంపీ తన పరిధిలో మాతృబాషా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆయన పార్లమెంటు సభ్యులందరికీ వారివారి మాతృభాషల్లో(22 ప్రాంతీయ భాషల్లో) లేఖలు రాశారు.

" భారతీయ భాషల్లోని సమున్నత సాహిత్య వారసత్వాన్ని సంరక్షించడానికి మనమందరం మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ జీవితంలో మాతృభాషా వినియోగాన్ని పెంచటం ద్వారా వీటికి విస్తృత ప్రచారం కల్పించాలి. మన దేశం 19,500 భాషలు, యాసలకు పుట్టినిల్లు. అందులో 200 భాషలు అంతర్థానమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

మనకున్న బహుళ భాషలు, సంపన్నమైన విభిన్న యాసలు, పురాతన విజ్ఞాన ఖజానాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు బలహీనస్థితికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం మాతృభాషలను చిన్న చూపు చూసే ధోరణే. ఆంగ్లంలో చదువుకున్న వారు కొందరు మాతృభాషను విస్మరించిన విధానాన్ని అదేవిధంగా కొనసాగిస్తే మిగిలిన భాషలు బక్కచిక్కి పోతాయని మహాత్మాగాంధీ దూరదృష్టితో ముందే హెచ్చరించారు. వీలైనన్ని భాషలు నేర్చుకోవడం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అయితే మాతృభాషలో బలమైన పునాది లేకపోతే అది సాధ్యం కాదు. ప్రతి పార్లమెంటు సభ్యుడూ మాతృభాషలను ప్రోత్సహించడంలో క్రియాశీలక వారధులుగా నిలవాలి. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 21న కార్యక్రమాలు నిర్వహించండి"

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

ఇదీ చూడండి: సంగీతానికి కేరాఫ్​ ఆ 'గిటార్​ హౌస్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.