ETV Bharat / bharat

కరోనాపై పోరు: దిల్లీలో వీహెచ్​పీ పిడకల ప్లాంట్

author img

By

Published : May 13, 2021, 7:47 PM IST

విశ్వహిందూ పరిషత్ దిల్లీలో పిడకల ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. ఆవు పేడతో భారీ స్థాయిలో పిడకలు తయారు చేయించి.. కరోనాకు బలైన వారి మృతదేహాల అంత్యక్రియల కోసం అందించనుంది.

VHP
విశ్వహిందూ పరిషత్

కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత వేధిస్తోంది. డిమాండ్​ను ఆసరాగా చేసుకుని కొందరు కట్టెలను వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టెల కొరత తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పిడకలను తయారు చేయాలని విశ్వహిందూ పరిషత్​ నిర్ణయించుకుంది. ఇందుకోసం పిడకలు(ఆవు పేడ మాత్రమే) తయారు చేసే ప్లాంటునే నిర్మించ తలపెట్టింది.

తమ ప్లాంట్​లో తయారు చేసిన పిడకలను దిల్లీలోని శ్మశాన వాటికలకు పంపించనున్నట్లు విశ్వహిందూ పరిషత్​ దిల్లీ విభాగం అధ్యక్షుడు కపిల్​ ఖన్నా ఈటీవీ భారత్​కు తెలిపారు. మొదటి ప్లాంట్​ను పాకిస్థాన్​నుంచి శరణార్థులుగా వచ్చిన వారు ఉంటున్న దిల్లీలోని రోహిణి క్యాంప్​ సమీపంలో పెడతామని తెలిపారు. ఇందుకు అవసరమైన సామగ్రిని గుజరాత్​లోని భావ్​నగర్​ నుంచి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.

"కరోనా మృతులకు దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు దొరకటం లేవు. ఒక వేళ దొరికినా వేల రూపాయలకు అమ్ముతున్నారు. పేద వారు అంత డబ్బుపెట్టి కొనలేరు. అందుకే మేము పిడకల్ని తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించున్నాం. వీటివల్ల కాలుష్యం తక్కువ. ఖర్చు కూడా తక్కువే" అని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.