venkaiah naidu on corruption: ప్రజాస్వామ్యాన్ని అవినీతి నాశనం చేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించవద్దని పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడ్డ అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. అలాగే.. న్యాయబద్ధంగా పనిచేసే అధికారులను నిరుత్సాహపరచవద్దని కోరారు.
ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ప్రభాత్ కుమార్ రచించిన పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అవినీతి కేసులపై సత్వర విచారణ జరిపించాలని చెప్పారు వెంకయ్యనాయుడు. న్యాయంగా పనిచేసే అధికారులను ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొన్నారు. పౌరసేవలలో పారదర్శకత పెంపొందించాలని, యువ అధికారులు వ్యవస్థలో నూతనత్వాన్ని తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: BSF raising day: 'డ్రోన్ విధ్వంసక సాంకేతికతతో భద్రత కట్టుదిట్టం'