భవిష్యత్‌లో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిశోధనలు ముమ్మరం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M.Venkaiah Naidu)... డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను కోరారు. డీఆర్డీఓకు చెందిన డీఐపీఏఎస్ ల్యాబ్‌కు 25మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దిల్లీలోని తన నివాసంలో కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తీవ్ర ప్రభావం..
కరోనా కారణంగా(Coronavirus) ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం ఏర్పడటంతోపాటు ప్రజల జీవితాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపినట్లు వెంకయ్య పేర్కొన్నారు. కరోనా చికిత్స, కట్టడి కోసం డీఆర్‌డీఓ చేసిన కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించినట్లు డీఆర్‌డీఓ విడుదల చేసినఓ ప్రకటనలో పేర్కొంది.
కరోనా వేరియంట్ల నేపథ్యంలో భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపింది. కొవిడ్ చికిత్స, కట్టడి కోసం డీఆర్‌డీఓ ల్యాబ్‌ల్లో తయారు చేసిన ఉత్పత్తులను.. డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వివరించారు.
ఇదీ చదవండి: covid variant: 'దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు'