ETV Bharat / bharat

రైతుల నిరసనలతో మూతపడ్డ టోల్​ప్లాజాలు

రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా శనివారం దిల్లీ సరిహద్దులోని టోల్​ప్లాజాలను మూసివేసి వాహనాలను ఎలాంటి రుసుములు లేకుండానే పంపిస్తూ నిరసన తెలుపుతున్నారు రైతులు. రోజంతా ఇలాగే నిరసన చేపడతామని తేల్చిచెబుతున్నారు.

author img

By

Published : Dec 12, 2020, 11:45 AM IST

toll plaza
టోల్​ ప్లాజాలు మూసివేసి ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను ఉద్ధృతం చేశారు రైతులు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీ సమీప సరిహద్దుల్లోని టోల్​ ప్లాజాలను మూసివేశారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలను పంపిస్తూ.. నిరసన తెలుపుతున్నారు.

టోల్​ ప్లాజాలు మూసివేసి ఆందోళనలు

శుక్రవారం అర్ధరాత్రి నుంచే దిల్లీ-హరియాణా సరిహద్దు కర్నాల్​లోని బస్తారా టోల్​ ప్లాజాను మూసివేసి.. వాహనాలను అనుమతిస్తున్నారు అన్నదాతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అలాగే.. అంబాలలోని శంభు టోల్​ప్లాజాను కూడా మూసివేశారు.

toll plaza
ఆందోళన చేస్తున్న రైతులు

" గత అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ టోల్​ప్లాజా మూసివేసి వాహనాలకు అనుమతిస్తున్నాం. కొందరు రైతులు వచ్చి మూసివేయాలని కోరారు. అయితే.. ఈ అంశంపై మాకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదు. కానీ ఈ నిరసన ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుందని రైతులు తెలిపారు."

- రవి తివారీ, శంభు టోల్​ప్లాజా ఇంఛార్జీ

శనివారం తెల్లవారుజామునే హిసార్​-దిల్లీ ఎన్​హెచ్​-9 రహదారిపై ఉన్న మయ్యడ్​ టోల్​ప్లాజాను మూసివేశారు రైతులు. వాహనాలను ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అనుమతిస్తున్నారు. ఈ టోల్​ప్లాజా పంజాబ్​, రాజస్థాన్​లను దిల్లీతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

toll plaza
టోల్​ప్లాజా వద్ద భారీగా బలగాల మోహరింపు
toll plaza
టోల్​ప్లాజా వద్ద రైతులు ఆందోళన

ఆగ్రాలో సాధారణంగానే..

ఆగ్రా జిల్లాలోని 5 టోల్​ప్లాజాల్లో సాధారణంగానే రుసుముల వసూలు కొనసాగుతోంది. టోల్​ప్లాజాలను రైతులు మూసివేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆగ్రా జిల్లా ఏఎస్పీ తెలిపారు. అన్నింటిపై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో ఖందోలి టోల్​ ప్లాజా వద్ద సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

toll plaza
ఖందోలి టోల్​ ప్లాజా వద్ద పరిస్థితి
toll plaza
ఆగ్రాలోని ఖందోలి టోల్​ ప్లాజా వద్ద సాధారణ పరిస్థితులు

దిల్లీ సరిహద్దులకు ప్రయాణం..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు మరింత బలం చేకూరుతోంది. నిరసనల్లో పాల్గొనేందుకు కురుక్షేత్రం నుంచి ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు అన్నదాతలు.

toll plaza
ట్రాక్టర్లలో దిల్లీకి బయలుదేరిన రైతులు
toll plaza
దిల్లీకి బయలుదేరిన రైతులు

డిసెంబర్​ 14న దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్​ 14న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించాయి రైతు సంఘాలు. దిల్లీ, హరియాణా, పంజాబ్​, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు ఒకరోజంతా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ అదే రోజు నుంచి నిరవధిక నిరసనలు చేస్తున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి: రైతన్నల నిరసనలు ఉద్ధృతం- టోల్​ప్లాజాల మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.