Vastu Tips Avoid These Things In Front of Main Door : ఇంట్లో అన్ని వస్తువులూ వాస్తు ప్రకారం ఉండాలని అంటారు వాస్తు నిపుణులు. అప్పుడే ఎలాంటి సమస్యలూ రాకుండా ఉంటాయని చెబుతారు. మరీ ముఖ్యంగా.. కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో.. ఇంటి దర్వాజ వద్ద ఉంచే వస్తువులు ముఖ్యమైనవని అంటున్నారు. కొన్ని వస్తువులు కుటుంబ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. మరి.. ఇంటి గుమ్మం వద్ద ఉంచగూడని వస్తువులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ముళ్లు ఉండొద్దు: ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్లు, ముళ్ల చెట్లని పెట్టకూడదంటున్నారు. కాక్టస్, గులాబీ మొక్కలు వంటివి ఉంచకూడదట. అదేవిధంగా.. ఎండిన, వాడిపోయిన మొక్కలు పెట్టకపోవడం మంచిదని.. దీని వల్ల దురదృష్టం వస్తుందని అంటున్నారు.
అద్దాలు: ఇంటి గుమ్మంలో, ముందు తలుపు దగ్గర చాలా మంది అద్దాలు పెడతారు. ఇది నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అద్దాలు, గాజు వస్తువులు గుమ్మం ముందు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఆయుధాలు : ఇంటికి ఎదురుగా కత్తులు, గొడ్డల్లు, గునపాలు.. వంటి ఇతర ఆయుధాలను పెట్టకపోవడమే మంచిది. దీని వల్ల ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని స్టోర్ రూమ్‌లో ఓ మూలన పెట్టేస్తే మంచిదని చెబుతున్నారు.
ఇంట్లో ఆ జంతువులను పెంచుతున్నారా? - వాస్తు శాస్త్రం ప్రకారం ఏమవుతుందో తెలుసా?
విరిగిన లేదా పగిలిన వస్తువులు : విరిగిన వస్తువులను ఇంటి ముందు పెట్టడం అంత మంచిది కాదు. దీని వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని పండితులు చెబుతారు. ఇదేవిదంగా.. విరిగిన వస్తువులను కూడా ఎప్పటికప్పుడు పారేయడమో.. స్టోర్ రూమ్‌లో పెట్టడమో మంచిదంటున్నారు.
చెప్పులు: చాలా మంది చెప్పులను ఇంటి గుమ్మానికి ఎదురుగా విడుస్తారు. ఇలా చేయకపోవడమే మంచిదంటున్నారు. గుమ్మానికి పక్కన చెప్పులు ఉంచడం మంచిదని చెబుతున్నారు. ఈ చెప్పులని ఎలా పడితే అలా విడవకుండా.. ఓ స్టాండ్ తీసుకుని చక్కగా అమర్చుకోవాలని సూచిస్తున్నారు.
చెత్త: చెత్తను ఇంటి గుమ్మంలో, తలుపు దగ్గర అస్సలు ఉంచకూడదట. ఇది మంచిది కాదని.. నెగెటివ్ ఎనర్జీని ఇంట్లో తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంటి ముందు కాకుండా.. వెనకాల పెట్టడం మంచిదని అంటున్నారు. ఇంకా.. చెత్తని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే మరింత మంచిదని చెబుతున్నారు.
చీకటి వద్దు: ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా వెలుగులోనే ఉండాలని.. గుమ్మం వద్ద చీకటి అస్సలు ఉండకూడదని సూచిస్తున్నారు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, దర్వాజ వద్ద ఎక్కువగా వెలుతురు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వీలైతే కొన్ని లైట్లు పెట్టడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు దోషం ఉంటే పిల్లలు పుట్టరా? సంతానలేమికి దీనికి సంబంధమేంటి?
Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!