Varun gandhi bjp: భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. మరోమారు సొంత ప్రభుత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, వారు ఇంకెంత కాలం సహనంతో ఉండాలని ప్రశ్నించారు.
"ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అవకాశం వచ్చినా, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. పరీక్ష రాసినా.. ఏళ్ల తరబడి ఫలితాలు వెలువడటం లేదు. ఏదో ఒక కారణంగా పరీక్షనే రద్దు చేసేస్తున్నారు. రైల్వే గ్రూప్ డీ పరీక్షల ఫలితాల కోసం 1.25కోట్ల మంది రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ నియామకాలకు ఇదే పరిస్థితి. దేశ యువత ఇంకెంత కాలం ఓపికతో ఉండాలి?"
--- వరుణ్ గాంధీ, భాజపా ఎంపీ.
రైతు నిరసనలకు మద్దతిస్తూ.. సొంత పార్టీపై వరుణ్ గాంధీ విమర్శలు చేయడం ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచింది. సాగు చట్టాలను రద్దు చేయాలని అనేకమార్లు ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- భాజపాకు కొరకరాని కొయ్యగా వరుణ్- ప్రియాంక మాస్టర్ ప్లాన్!