ETV Bharat / bharat

'భారతీయ టీకా సురక్షితం- కోటి మందికిపైగా వ్యాక్సినేషన్​'

దేశంలో కోటి మందికి పైగా కరోనా టీకాను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్​ హర్షవర్ధన్​ ప్రకటించారు. అతిపెద్ద టీకా పంపిణీ కోసం 2.11 లక్షల సెషన్లు నిర్వహించామన్నారు. టీకాల పట్ల అపోహలు పెట్టుకోవద్దని.. ఇవి పూర్తిగా సురక్షితమైనవని తెలిపారు. భారతీయ ఆయుర్వేద విశిష్టతను ప్రపంచం గుర్తించిందన్నారు.

author img

By

Published : Feb 19, 2021, 10:04 PM IST

Vardhan appeals to healthcare, frontline workers to get vaccinated against COVID
'దేశంలో కోటి మందికి వ్యాక్సిన్​-భారతీయ టీకా సురక్షితం'

దేశంలో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోందని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్​. కేవలం 34 రోజుల్లోనే కోటి డోసుల మార్కును చేరుకొని ప్రపంచంలో.. అమెరికా తర్వాత అత్యంత వేగంగా టీకా అందించిన రెండో దేశంగా నిలిచామన్నారు. అతిపెద్ద టీకా పంపిణీ కోసం 2.11 లక్షల సెషన్లు నిర్వహించామన్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటీ 4 లక్షల 49 వేల 942 టీకా డోసులు అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్కరోజే సుమారు 6 లక్షలకు పైగా టీకా డోసులు అందించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం వరకు 70 లక్షల డోసులు ఆరోగ్య కార్యకర్తలకు, 33 లక్షలకుపైగా డోసులు.. పారిశుద్ధ్య కార్మికులకు అందించామన్నారు. అదేసమయంలో 6లక్షల మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోసు తీసుకున్నారని వివరించారు.

ప్రతీ ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. పారిశుద్ధ్య కార్మికులకు విజ్ఞప్తి చేశారు. టీకాలు పూర్తిగా సురక్షితమైనవని.. రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.

''ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు షెడ్యూల్ ప్రకారం కొవిడ్​-19 టీకా డోసులు వేయించుకోండి. టీకాలు సురక్షితమైనవే. వీటి సమర్థతపై ఎటువంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.''

-డాక్టర్ హర్ష వర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి.

కరోనా టీకా కారణంగా దేశంలో మరణాలు సంభవించలేదని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. కేవలం 0.0004 మందిపై మాత్రమే ప్రతికూల ప్రభావం పడిందని తెలిపారు.

ఆయుర్వేదంలో భారత్​ భేష్..

కరోనా తరువాత ఆయుర్వేద ఆధారిత ఆర్థిక వ్యవస్థ 90 శాతం వృద్ధిని సాధించిందన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్. కరోనా నేపథ్యంలో భారతీయ ఆయుర్వేదం ప్రపంచ ఆమోదం పొందిందని తెలిపారు. హరిద్వార్​లోని పతంజలి ఆయుర్వేద కేంద్రం వెలువరించిన పరిశోధనా పత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ రంగంలో ఎగుమతులతో పాటు పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రపంచం ప్రజలు భారతీయ ఆయుర్వేదాన్ని అంగీకరించారనడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

రామ్​దేవ్​ కృషి ప్రశంసనీయం..​

కరోనా కాలంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ 140 ప్రాంతాల్లో 109 రకాల అధ్యయనాలు చేసిందని.. ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా, ఈ రంగ అభివృద్ధికి సానుకూలంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద కేంద్రం చేస్తున్న కృషిని హర్ష వర్ధన్​ ప్రశంసించారు. శాస్త్రీయ, ఆధునిక పద్ధతుల్లో నడుపుతోన్న ఈ కేంద్రం ఆయుర్వేద ప్రపంచంలో గొప్ప సేవలు చేస్తోందని కొనియాడారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.