ETV Bharat / bharat

కరోనానే కాదు.. కీచకుల నుంచీ రక్షణ కల్పించే 'స్మార్ట్​ మాస్క్'!

author img

By

Published : Jan 11, 2022, 6:30 AM IST

Smart Women Safety Mask: కరోనా వేళ మాస్క్​కు విపరీతమైన డిమాండ్​ ఉంది. ఇందులో భాగంగా తయారైన స్మార్ట్​మాస్క్​కు ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్​ మాస్క్​ ఏంటి? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

smart mask
స్మార్ట్​ మాస్క్

మహిళలకు రక్షణ కల్పించే 'స్మార్ట్​ మాస్క్​'

Smart Women Safety Mask: కరోనా కాలంలో మాస్క్​ లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నాం. మాస్క్​ ఉంటే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందని మన ధీమా. ఇందులో క్లాత్​ మాస్క్​, ఎన్​95 అంటూ ఎన్నో రకాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి స్మార్ట్​ మాస్క్​ చేరింది. ఇది మిగతా వాటికన్నా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం వైరస్​ల నుంచే కాదు ఆపదల నుంచి కూడా రక్షిస్తుంది. అవును మీరు విన్నది నిజమే.. ఈ మాస్క్​ ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసికి చెందిన శ్యామ్​ చౌరాసియా రూపొందించారు.

unique face mask
స్మార్ట్​ మాస్క్​తో శ్యామ్​ చౌరాసియా

వైరస్​ నుంచి రక్షణ కల్పించే మాస్కే.. మహిళలకు కూడా ఎందుకు రక్షణ కల్పించలేదన్న శ్యామ్​ ఆలోచన నుంచి ఈ స్మార్ట్​ మాస్క్​ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు మహిళలకు రక్షణ కవచంలా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్​ శక్తి యోజన కింద శ్యామ్​ ఈ మాస్క్​ను తయారు చేశారు. ఇందుకోసం సాధారణ మాస్క్​కు ఓ ప్రత్యేకమైన సెన్సార్​ను అమర్చారు. బ్లూటూత్​ ద్వారా ఈ మాస్క్​ను ఫోనుకు కనెక్ట్​ చేసుకోవచ్చు. మాస్క్​పైన ఉన్న సెన్సార్​ను ప్రెస్​ చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్నా సరే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది. లొకేషన్​ వివరాలు తెలుస్తాయి. హెల్ప్​లైన్​ నంబర్​తో పాటు ఎమర్జెన్సీ కోసం రిజిస్టరైన మరో నంబర్​కు కూడా ఈ స్మార్ట్​మాస్క్ సందేశాన్ని పంపిస్తుంది.

unique face mask
స్మార్ట్​ మాస్క్​ ధరించిన మహిళ

ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ మాస్క్​ల తయారీ మరింత విస్తృతం చేసే అవకాశం ఉందంటున్నారు శ్యామ్​.

మహిళల కోసం అమలు చేస్తున్న మిషన్​ శక్తి యోజన కింద నేను ఈ మాస్క్​ తయారు చేశాను. దీంతో 24 గంటలు మహిళకు భద్రత ఉంటుంది. జీపీఎస్​, సిమ్ ​కార్డులతో పనిచేసే ఇటువంటి పరికరాలు మార్కెట్​లో ఇప్పటికే ఉన్నాయి. కానీ అవి ఖర్చు ఎక్కువ. వాటితో పోలిస్తే ఈ మాస్క్​కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. సుమారు రూ.700లలో ఈ మాస్క్​ను తయారు చేయచ్చు.

-శ్యామ్​ చౌరాసియా, తయారీదారు

ఇదీ చూడండి : తిరిగి విధుల్లోకి 'సింహా' మీసాల పోలీసు- సస్పెన్షన్​ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.